మురుగదాస్ – మహేష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్!

haris jayaraj as music director for mahesh babu murugadoss movieశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రస్తుతం “బ్రహ్మోత్సవం” చిత్రంలో నటిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు, ఈ సినిమా పూర్తి కాగానే, తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపధ్యంలో చిత్ర తారాగణాన్ని, సాంకేతిక నిపుణులను దర్శక నిర్మాతలు ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

ఇందులో భాగంగా సంగీత దర్శకుడ్ని ఎంపిక చేసింది చిత్ర యూనిట్. మురగదాస్ చిత్రాలకు సంగీతం అందించే హారీష్ జయరాజే ఈ సినిమాకు కూడా స్వరాలు అందించబోతున్నారు. ఈ విషయాన్ని జయరాజ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మహేష్ – జయరాజ్ కాంభినేషన్ లో ఇప్పటికే “సైనికుడు” సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

తెలుగు సినిమాలకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ అందించినా, ఏ ఒక్కటి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడంతో, సెంటిమెంట్ గా హరీష్ జయరాజ్ కు మైనస్ మార్కులు పడిన నేపధ్యంలో మహేష్ మరోసారి జయరాజ్ ఎంపికను సమర్థించడం ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories