మూడు తుస్.. విశాఖ తుస్.. మావిగన్‌ కూడా తుస్!

Jagan Amaravati capital and MA VIGAN debate

ఒక రాజకీయ నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఎంత అవసరమో, ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. లేకుంటే ఫలితం ఏవిధంగా ఉంటుందో వైసీపీ పరిస్థితి చూస్తే అర్ధమవుతుంది.

మాట తప్పను మడమ తిప్పను.. అమరావతే మన రాజధాని అంటూ నమ్మబలికి 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ఏం చేశారో అందరికీ తెలుసు. అందుకు ఆయనతో సహా వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

ADVERTISEMENT

కనుక ఆ తర్వాత అయినా తప్పు సరిదిద్దుకుని అమరావతికి జై కొట్టవచ్చు లేదా ప్రజలు తన మాట నమ్మరనే అనుమానం ఉండి ఉంటే రాజధాని విషయంలో జగన్‌ మౌనంగా ఉండిపోవచ్చు. కానీ తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరావతికి పార్లమెంటులో చట్టబద్దత కల్పిస్తుండటం సహించలేక జగన్‌ మళ్ళీ ‘మావిగన్‌’ అంటూ మళ్ళీ కొత్త పాట మొదలుపెట్టారు.

మూడు రాజధానులు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకే అని వైసీపీ చెప్పుకున్నప్పటికీ, ఆ పేరుతో మూడు ప్రాంతాలలో కూటమి అడుగుపెట్టలేని పరిస్థితి కల్పించి రాజకీయంగా దెబ్బ తీయాలనేదే జగన్‌ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా ‘మావిగన్‌’ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలను మభ్యపెట్టి కూటమి పట్ల వ్యతిరేకత సృష్టించి రాజకీయంగా దానిపై పైచేయి సాధించాలని జగన్‌ ఆలోచన కావచ్చు.

కానీ చాలా రాజకీయ చైతన్యం కలిగిన ఈ మూడు ప్రాంతాల ప్రజలు, మావిగన్‌ వెనుక జగన్‌ ఆలోచన లేదా ఉద్దేశ్యం ఏమిటో సులువుగానే పసిగట్టారు.

అమరావతి పుణ్యమాని రియల్ ఎస్టేట్‌తో సహా మళ్ళీ అన్ని రకాల వ్యాపారాలు పుంజుకున్నప్పుడు ఇలాంటి ఉచ్చులో చిక్కుకుంటే మనమే తీవ్రంగా నష్టపోతామని మావిగన్‌ ప్రజలు బాగానే గ్రహించారు. పైగా ‘జగన్‌ 2.0’ ఏవిధంగా ఉండబోతోందో మున్సిపల్ ఎన్నికలలోనే చిన్న శాంపుల్ కూడా చూపారు. కనుక ఈ ఎన్నికలలో మావిగన్‌ ఓటర్లు వైసీపీనే వ్యతిరేకించారు.

కనుక ఇప్పటికైనా జగన్‌ తీరు, ఆలోచనలు, విధానాలు మార్చుకుంటారా? అంటే అందుకు అయన అహం అనుమతించదు.

కనుక అయన వైసీపీ అనే టైటానిక్ షిప్‌కు కెప్టెన్ వంటివారు అనుకోవచ్చు. ఆ షిప్పు భారీతనం, కెప్టెన్ మీద నమ్మకంతో దానిలో వైసీపీ శ్రేణులు నిశ్చింతగా ప్రయాణిస్తున్నారే తప్ప ఎవరూ పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయడం లేదు. కనుక 2029 ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయేమో?

ADVERTISEMENT
Latest Stories