Telugu

ఇక్కడ పవన్.. అక్కడ హరీష్‌ టార్గెట్..లక్ష్యం ఒకటే!

ఇక్కడ కూటమి ప్రభుత్వంలో నుంచి జనసేనను విడదీసి దూరం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లే, అక్కడ తెలంగాణలో హరీష్‌ రావును బీఆర్ఎస్‌కు దూరం చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పార్టీ ప్రయత్నిస్తుండటం కాకతాళీయమే.

రాష్ట్రాలు, పార్టీలు, నేతలు వారి ప్రత్యర్ధులు వేరయినా వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే. ఇక్కడ కూటమిని, అక్కడ బీఆర్ఎస్‌ పార్టీని బలహీనపరిచి రాజకీయంగా దెబ్బ తీయడమే.

ADVERTISEMENT

ఈ విషయం ఇక్కడ జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, సీఎం చంద్రబాబు నాయుడులకు బాగా తెలుసు. కనుక ఇద్దరూ కలిసికట్టుగా పనిచేస్తూ వైసీపీ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నారు.

గురువారం సిద్ధిపేట బహిరంగ సభల హరీష్‌ రావును ఉద్దేశ్యించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరతారని, దాని కోసమే ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని అన్నారు. బిజేపితో సంప్రదింపులు జరపడం లేదని హరీష్‌ రావు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు.

హరీష్‌ రావుపై చాలా కాలంగా ఇటువంటి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన బిజేపిలో చేరే అవకాశం ఉందనే కాంగ్రెస్‌ వాదనలపై బిజేపి స్పందించకుండా మౌనం వహిస్తోంది. ఇది వ్యూహాత్మక మౌనంగానే భావించవచ్చు.

హరీష్‌ రావు విషయంలో మౌనం వహించడం ద్వారా ఆయన తమ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారనే అనుమానం, అభిప్రాయం బీఆర్ఎస్‌ అధిష్టానానికి కలిగించగలుగుతోంది.

హరీష్‌ రావు విషయంలో కల్వకుంట్ల కవిత, సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తునప్పటికీ, ఆయనకు మద్దతుగా కేసీఆర్‌, కేటీఆర్‌, ఇతర బీఆర్ఎస్‌ ముఖ్యనేతలు మాట్లాడకపోవడంతో ఆయనే స్వయంగా ఖండించుకోవాల్సి వస్తోంది.

అంటే హరీష్‌ రావు విషయంలో కేసీఆర్‌కు అటువంటి అనుమానాలు కలిగించడంలో ఆయన ప్రత్యర్ధుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? అనే సందేహం కలుగుతుంది.

లేకుంటే, పార్టీకి మూలస్థంభం వంటి హరీష్‌ రావుకు మద్దతుగా మాట్లాడాలి కదా? ఆయనపై ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలను బలంగా తిప్పి కొట్టాలి కదా?

హరీష్ విషయంలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరుకు, పవన్ కళ్యాణ్‌ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇంత భిన్నంగా ఉండటం మరో విశేషం.

కనుక పార్టీ అధిష్టానానికి తనపై నమ్మకం లేదని హరీష్‌ రావుకు అనిపించిన రోజు, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయినట్లుగా, హరీష్‌ రావు కూడా బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఖాయం.

ఒకవేళ వెళ్తే ఆయన ఒంటరిగా వెళ్ళరు. వెంట కనీసం 15-20 మంది ముఖ్యనేతలను వెంట తీసుకుపోవడం ఖాయం. అదే జరిగితే బీఆర్ఎస్‌ పార్టీ కుప్ప కూలడం కూడా ఖాయమే. కనుక హరీష్‌ రావుకు అండగా నిలబడి ఆయనను కాపాడుకునే బదులు ఈవిధంగా వ్యవహరిస్తూ ఆయన పార్టీ పట్ల తన విధేయతను పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితి కల్పించడం బీఆర్ఎస్‌ పార్టీ చేస్తున్న తప్పు అని చెప్పక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Day 1 BO: How Did ENE 2 Start?

Ee Nagaraniki Emaindi is one of the notable urban comedy entertainers in Telugu cinema. The…

12 minutes ago

GV Prakash: Telugu Cinema’s New Musical Favourite?

GV Prakash Kumar seems to have found a strong place for himself in Telugu cinema.…

42 minutes ago