
Harish Rao Cites Chandrababu on Water
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటారు? తెలంగాణ నీళ్ళు ఎత్తుకు పోతున్నారంటారు.
తమ సిఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాల్సింది పోయి, ఆయనకు, చంద్రబాబు నాయుడుకు ముడిపెట్టి తెలంగాణకు అన్యాయం జరిగిపోతోందని మొసలి కన్నీళ్ళు కార్చుతుంటారు.
కనుక ఎప్పుడూ చంద్రబాబు నాయుడుని తిట్టే నోటితో అయన గురించి ఒక మంచి మాట చెప్పడం చాలా కష్టమే. అయితే గమ్మతైన విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచి పనులు గురించి చెప్పాల్సి రావడం.
అయితే సిఎం రేవంత్ రెడ్డి వైఫల్యం లేదా అసమర్ధతని తెలంగాణ ప్రజలకు మరింత బాగా అర్ధమయ్యేలా వివరించడం కోసం హరీష్ రావు ఏమన్నారంటే, “మన సిఎం కంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడే నయం. అక్కడ ఆయన శ్రీశైలం నుంచి 800 కిమీ దూరంలో ఉన్న తన కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు పారిస్తున్నారు.
అక్కడ అయన తన సొంత జిల్లాకు అంత దూరం నుంచి నీళ్ళు పారిస్తుంటే, ఇక్కడ మన సిఎం మోటార్లు ఆన్ చేసి పక్కనే గోదావరిలో నీళ్ళు తోడిపోసి అందించలేకపోతున్నాడు,” అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషించే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అయనని ఈవిధంగా మెచ్చుకుంటున్నారు. కానీ మన రాష్ట్రంలో ఆయన సాటి రాయలసీమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పనీ చేయడం లేదని వాదిస్తూనే ఉంటారు.
పైగా వైసీపీలో కార్యకర్తలు మొదలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయడం లేదని వాదిస్తుంటారు. ఇంతకంటే విషాదం ఏముంటుంది? చంద్రబాబు నాయుడుని ద్వేషించే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినా నమ్మకపోతే ఎలా?
Vijay Deverakonda and director Rahul Sankrityan’s Rana Baali is slowly building buzz ahead of its…
The YSRCP is facing another round of resignations in Cheepurupalli, the home constituency of senior…