
జాతీయ పార్టీగా పేరు మార్చుకుంటే చాలదు జాతీయ భావాలు కూడా ఉండాలిగా అంటున్నారు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తున్న జనసైనికులు. తెరాస నుండి బిఆర్ఎస్ గా మారినా తమ వక్రబుద్ధి మార్చుకోలేకపోతున్నారు హరీష్ రావు.
రాష్ట్రంలో ఎన్నికలు మొదలుకాగానే ఆంద్రోళ్ళు, తెలంగాణ ద్రోహులు అంటూ పదేపదే విమర్శలు చేస్తూ ఇంకా ఎంతకాలం ఇలా ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని తమ రాజకీయాలు కొనసాగిస్తుంటారు ఈ బిఆర్ఎస్ నేతలు.ఆంధ్రోళ్ల పెత్తనం,ఆంధ్రోళ్ల పాలన ఇంకా మనకు అవసరమా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.
తాజాగా సంగారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులందరు కలిసి కేసీఆర్ మీదకు దండయాత్రకు వస్తున్నారు. ప్రజలు జర భద్రంగా ఉండి కారు గుర్తుకి ఓటువేసి తెలంగాణను గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణ వాదం గెలిసినట్టే అంటూ మళ్ళీ అదే తరహా రాజకీయ మొదలుపెట్టారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఇక్కడ ఎవరు తప్పు పట్టలేదు కేవలం విభజించిన విధానాన్నే అందరూ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని పదకొండు రోజులు భోజనం మానేసిన వ్యక్తిని వెంటేసుకుని బీజేపీ తెలంగాణలో రాజకీయ చేయడానికి బయలుదేరిందని., అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న షర్మిలతో దోస్తానా చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని వీరంతా తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.తెలంగాణాలో టీడీపీ పోటీ చేయకూడదు, ఏపీలో రాజకీయ పార్టీ ఉన్నా
ఏ నేత తెలంగాణాలో పోటీ చేయకూడదు అనే సిద్ధాంతంతో బిఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నట్టున్నారు.
అయితే ఇక్కడా ఆంధ్రా ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ హరీష్ రావు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్నున్నాయి.షర్మిల తెలంగాణ ద్రోహి అయితే జగన్ తో మీ ప్రభుత్వం దోస్తానా ఎలా కట్టింది.గత ఎన్నికలలో ఏపీలో జగన్ గెలుపుకి మీ ప్రభుత్వం ఎందుకు సహకారం అందించింది.అంటే తెలంగాణ ప్రజలను మీరు మోసం చేశారా?
ఆంధ్రోళ్ల పాలన మీకు అవసరమా అంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఎందుకు ఏర్పాటు చేశారు.ఆంధ్రోళ్లు అంటూ విమర్శించే కేసీఆర్ ఆంధ్రా ద్రోహులు అవుతారా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా.తమ రాజకీయాల కోసం బిఆర్ఎస్ పార్టీ ఎవరితో అయినా లోపాయికార పొత్తులు పెట్టుకుంటూ పక్క రాష్ట్రాల రాజకీయాలలో కూడా తమ ప్రభావాన్ని చూపించాలని ఆశపడొచ్చు కానీ తెలంగాణాలో పుట్టిన జనసేన కానీ టీడీపీ పార్టీ మాత్రం తెలంగాణలో పోటీ చేయడానికి మీ పార్టీ నేతల అనుమతి కోరాలా?
మీకు మద్దతు తెలిపితే వారు తెలంగాణ ప్రేమికులు అదే వ్యక్తి ఇక్కడ పోటీచేయాలని చూస్తే మాత్రం తెలంగాణ ద్రోహులుగా మారిపోతారా? రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటూ కూడా ఎన్నికల సమయంలో ఇలా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఈ మూస రాజకీయాలు ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారో ఈ బిఆర్ఎస్ అని చెప్పబడే తెరాస నేతలు. ఇటువంటి వారి వ్యాఖ్యల వలన నష్టపోయేది ప్రజలు లాభపడేది మాత్రం రాజకీయ నాయకులే. ఇకనైనా “థింక్ బిగ్” అండి హరీష్ రావు గారు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…