Telugu

కవిత వందంటే ఈయన 327 ఎకరాలు అంటారేమిటి?

అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అనే మాట విన్నాము కానీ ప్రభుత్వ భూమిని అల్లుడు మామకు దానం చేసినట్లు ఎన్నడూ విని ఉండం. కానీ మాజీ మంత్రి హరీష్‌ రావు అలా.. ప్రభుత్వ భూమిని మావగారు మాధవరం హనుమంత రావుకి అప్పగించేశారట.

తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శాసనసభలో ఈ విషయం బయట పెట్టారు.

ADVERTISEMENT

“సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామం సర్వేనెంబర్ 271లో 327 ఎకరాల 9 గుంటల ప్రభుత్వం భూమిని ఆనాడు ఇందిరా గాంధీ హయంలో పేదలకు పట్టాలు ఇచ్చారు. ఇవి అసైన్డ్ భూములు కనుక 22ఏ నిషేధిత జాబితాలో ఉంటాయి.

బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న హరీష్‌ రావు 2023, ఆగస్టులో వాటిని పట్టాభూములుగా మార్చేసి, పాస్ బుక్కులు చేయించి తన తన మావగారికి అల్లుడి కానుకగా సమర్పించుకున్నారు.

ఎంత పిల్లనిచ్చిన మామ అయినా.. పేదల భూమి గుంజుకొని ఇచ్చేస్తారా? ఇది కేవలం న్యాయమేనా? బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయంలో జరిగిన అనేక భూఅక్రమాలలో ఇదొక చిన్న మచ్చు తునక మాత్రమే,” అని మంత్రి పొంగులేటి అన్నారు.

అయితే హరీష్‌ రావు సిద్ధిపేట పట్టణంలోనే వంద ఎకరాలు తన తండ్రి పేర రిజిస్టర్ చేశారని, అవి కూడా 22ఏ నిషేధిత భూములేనని టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారమే బయటపెట్టారు. అంటే తండ్రికి ఓ వంద ఎకరాలు, మావగారికో 327 ఎకరాలు ఇచ్చుకున్నారన్న మాట!

అందరి గురించి ఆలోచించే హరీష్‌ రావు మరి తనకంటూ ఏమీ ఏర్పాటు చేసుకోలేదా? అంటే పక్క జిల్లాలో ఓ 400 ఎకరాలు మాత్రమే తీసుకొని, దానిలో చిన్న ఫామ్‌హౌసు కట్టుకున్నారని కల్వకుంట్ల కవితే చెప్పారు.

అంటే హరీష్‌ రావు కోటాలోనే ఓ 827 ఎకరాలు లెక్క తేలిందన్న మాట! మిగిలినవారు ఎంతెంత పుచ్చుకున్నారో?

ఇంతకీ ఈ భూములు అసలా కొసారా? అంటే కొసరే అని కల్వకుంట్ల కవితలాంటి వారు వితండవాదనలు చేస్తూ పాపం ఆ పెద్ద మనిషి మనసు నొప్పిస్తూనే ఉంటారు.

“తెలంగాణ మీ అయ్య జాగీరా?” అని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ అడిగినప్పుడు “యస్ మా అయ్యా జాగీరే..” అని బీఆర్ఎస్‌ నేతలు, కల్వకుంట్ల కవిత ఎందుకన్నారో ఇప్పుడు అర్ధమవుతోంది…కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

After Irumudi, Only Flops: Hanuman Ansh Telugu BO Savior?

The Telugu box office is going through one of those weeks where the number of…

14 minutes ago

Chiranjeevi Appreciates Irumudi Team

​Megastar Chiranjeevi is renowned for celebrating success of other actors and stars as that would…

40 minutes ago