
మొన్న హైదరాబాద్ లో జరిగిన ఒక సినిమా ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్. సెహరి అనే చిన్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశాడు బాలయ్య. అయితే ఆ ఈవెంట్ కి సంబంధించిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఈవెంట్ లో బాలయ్య ఆ సినిమా హీరో చేతి మీద కొడతాడు.
బాలయ్య కోపం గురించి తెలిసిందే అంటూ ట్రోల్ చేశారు. అయితే దాని మీద ఆ సదరు హీరో క్లారిటీ ఇచ్చారు. “ఆ రోజు.. నేను సినిమా పోస్టర్ ని ఎడమ చేతితో పట్టుకున్నా, అది తప్పని వారిస్తూ ఆయన చేతి మీద చిన్నగా కొట్టారు. ఆయన చాలా మంచి మనిషి,” అని ఆ సినిమా హీరో సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికి ఈ విషయంలో బాలయ్యని తప్పుగా అర్ధం చేసుకున్నాం అనే చెప్పుకోవాలి. గత అనుభవాల దృష్ట్యా బాలయ్యని చాలా మంది అలా అనుకున్నారు. ఇది ఇలా ఉండగా.. సెహరి అనే సినిమా ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు హర్ష్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
గంగసాగర్ ద్వారక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఆ సాన్నిహిత్యం మీద బాలయ్య ఆ ఈవెంట్ కు హాజరు అయ్యారు. అయితే ఆ ఈవెంట్ ఈ విధంగా వార్తల్లో నిలిచింది.





