బిగ్ న్యూస్ : హైదరాబాద్ లో భయంకర పరిస్థితులు!

heavy-rainfall-in-hyderabadహైదరబాద్ వాసులను భీకర వర్షం పలకరించింది. ఎప్పుడూ ఆహ్లాదకరంగా పలకరించే వరుణుడు ఈ సారి కాస్త ఘాటుగా పలకరించాడు. సాధారణంగా వర్షం పడుతుంటే ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. కానీ తాజాగా కురిసిన గాలి, వానకు ఎక్కడ ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో నగర వాసుల్లో ఆందోళన నెలకొంది.

పిడుగులు పక్కనే పడుతున్న శబ్దంతో నగర వాసులు బెంబేలెత్తిపోయారు. పలుచోట్ల కురిసిన వర్షానికి రోడ్లు నీటితో నిండిపోగా, వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు, విద్యుత్ స్థంభాలు రోడ్లపై పడిపోయాయి. నగర శివార్లన ఈసీఐల్ నుంచి జీడిమెట్ల వరకు వర్షం కురవడంతో నగరవాసి తడిసిముద్దయ్యాడు. మధ్యాహ్నం వరకు ఎండగా ఉండడంతో వర్షంపై ఎలాంటి అంచనాలు లేని సమయంలో క్యూములో నింబస్ మేఘాల కారణంగా వర్షం కురిసింది.

ADVERTISEMENT

ఈ గాలి, వాన బీభత్సం ప్రభావం శంషాబాద్ ఎయిర్ పోర్టుపై కూడా పడింది. సాయంత్రం 5 గంటల నుంచి పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన విమానాల్లో ‘స్పైస్ జెట్’వి కూడా ఉన్నాయి. కాగా, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి, పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విశ్వనగరంగా పేరు గాంచిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సెంటర్లో నేలకూలిన ఓ స్థంభం పలు కార్లను ధ్వంసం చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

heavy-rainfall-in-hyderabad

heavy-rainfall-in-hyderabad

ADVERTISEMENT
Latest Stories