‘బోల్డ్’ క్యారెక్టర్ చేసిన బ్యూటీకి ‘బోలెడు’ ఆఫర్లు!

Heebah patel finalized for Express Sharwanand“కుమారి 21ఎఫ్” ద్వారా ఓ బోల్డ్ క్యారెక్టర్ తో తెలుగు తెరకు పరిచయమైన హేబాపటేల్ అందాల ఆవిష్కరణలోనే కాదు, అభినయం పరంగానూ మంచి మార్కులు వేయించుకుంది. అయితే ఆశించిన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోయిన హేబా పటేల్ నెమ్మదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం అర డజను ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT

నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మరోసారి తన ‘కుమారి 21ఎఫ్’ హీరో రాజ్‌తరుణ్‌‌తో జత కట్టబోతున్న హేబా, ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో మోహన్‌లాల్ – గౌతమి నటిస్తున్న చిత్రంలోనూ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలాగే సాయి కొర్రపాటి నిర్మాణంలో ఒక సినిమాకు, శర్వానంద్- మహేష్ కాంబోలో రానున్న మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

ఇలాంటి గ్లామర్ రోల్స్ తో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ యువ దర్శకుడికి కూడా హేబానే ఛాయిస్ గా మారిందట. ఇలా ఆరడజను సినిమాలను లైన్ లో పెట్టి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది హేబా పటేల్.

ADVERTISEMENT
Latest Stories