ఎన్టీఆర్ కు వారం గ్యాప్ లో వస్తున్నాడు!

Hello-Guru-Prema-Kosame---DSP-Fails-Ram-This-Timeఈ నెల 11వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ “హలో గురు ప్రేమ కోసమే” విడుదలకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఆడియోను సోమవారం నాడు విడుదల చేస్తున్నామని సమాచారం ఇస్తూ, విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఈ దసరాకు మరో సరదా మూవీ ప్రేక్షకులను పలకరించనుందన్న మాట. ‘నేను శైలజ’ సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్, ఆ తర్వాత ‘హైపర్, ఉన్నదీ ఒకటే జిందగీ’లతో కాస్త వెనుకబడ్డాడు. దీంతో ఈ సినిమా విజయం రామ్ కు చాలా కీలకం కానుంది. ‘నేను లోకల్’ సూపర్ హిట్ కాంబో నక్కిన డైరెక్టర్ త్రినాధరావు మరియు నిర్మాత దిల్ రాజులు ఈ సినిమాకు బ్యాక్ బోన్స్.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories