పవన్ కళ్యాణ్ ను గట్టిగానే వేసుకున్నారు!

hero-sivaji-questions pawan kalyanఇటీవల అమరావతి వచ్చి రచ్చ రచ్చ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని ఆపేస్తాం, అమరావతి నిర్మాణాలను అడ్డుకుంటాం, రైతులు తిరగబడండి, మీకు నేను అండగా ఉంటానంటూ రెచ్చగొట్టుడు ధోరణిలో వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ పై హీరో శివాజీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

[m9ad]

ADVERTISEMENT

‘మేధావుల మౌనం – సమాజానికి శాపం’ అనే సదస్సులో పాల్గొన్న శివాజీ… ‘అమరావతిని ఆపేసి రాజధానిని ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని పవన్ కళ్యాణ్ ను నిలదీసారు. జగన్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని తన రాజకీయ లబ్దికి వినియోగించుకుంటున్నారు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడడం లేదని విమర్శల వర్షం కురిపించారు.

కేంద్ర పరిధిలో ఉన్న అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడితే ఏమోస్తుందోనని చెప్పిన శివాజీ, ప్రధాని 54 దేశాలు తిరిగి దేశానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని, చంద్రబాబు మాత్రం ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని, ఈ విషయంలో మోడీని ఎందుకు ప్రశ్నించరంటూ నిలదీసారు. నిజానికి పవన్ చేసిన ఆ వ్యాఖ్యల పట్ల ఒక్క శివాజీనే కాదు, అమరావతి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories