బోయపాటి నాతో సినిమా తీసే అవకాశమే లేదు!

Srikanth son boyapati direction“నన్ను హీరోగా పెట్టి దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా తీస్తాడని నేనైతే ఆశించను.., కానీ మా అబ్బాయితో సినిమా తీస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తాను” అంటూ ఫ్యామిలీ హీరో, ప్రస్తుతం అల్లు అర్జున్ బాబాయ్ శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ‘సరైనోడు’ చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన శ్రీకాంత్, గతంలో తాను నటించిన రెండు చిత్రాలకు బోయపాటి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

బోయపాటి పెద్ద డైరెక్టర్ అవుతాడని ఆ సమయంలోనే అంచనా వేశానని, అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే డైలాగ్ లు రాస్తూ ఉండేవాడని అన్నారు. బోయపాటి డైరెక్టర్ అయిన తర్వాత తనను హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తాడేమోనని నాడు అనుకున్నానని, అయితే ప్రస్తుతం మాత్రం అలాంటి ఆశలు లేవంటూ నవ్వులు పూయించాడు శ్రీకాంత్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories