
ఆ సంగీత దర్శకుడే మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే సమాచారాన్ని అందించారు. “దర్శకుడు సురేందర్ రెడ్డి సహకారంతో “ధృవ” బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చిందని, వెండితెరపై చూడడానికి నిరీక్షిస్తున్నానని, ఖచ్చితంగా రెండు సార్లు చూస్తానని, అభిమానులంతా చూసి పిచ్చేక్కిపోవడానికి సిద్ధం కమ్మని” పిలుపునిచ్చారు. “మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం, ఖచ్చితంగా ఓ భారీ విజయం అయితే దక్కుందని” ఫేస్ బుక్ వేదికగా హిప్ హాప్ అందించిన సమాచారంతో మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోతున్నారు.
చూడబోతుంటే చిత్ర యూనిట్ “ధృవ”పై భారీ అంచనాలనే పెట్టుకున్నట్లుగా కనపడుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ట్రేడ్ వర్గాలలో కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్ లలో బ్రహ్మరధం పడతారన్న నమ్మకంతోనే, అక్కడ కూడా భారీ ప్రచారం చేస్తున్నారని, ఖచ్చితంగా ‘ధృవ’ ద్వారా మెగా వారసుడు మళ్ళీ రికార్డుల మోత మోగిస్తాడని చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి ఫస్ట్ టాక్ రావాలంటే కనీసం 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే!
బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిన సంగతి…
KVN Productions has quickly established itself as one of the ambitious production houses in South…