పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాల పై ఉన్న కళంకం తొలగిపోయినట్టేనా?

pawan kalyan silent on budget 2021గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తనకు సినిమాలు అంటే ఇంటరెస్ట్ లేదని… రాజకీయాలకు డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నా అని ఆయన బహిరంగంగానే చెప్పేస్తారు. అదే ప్రకారంగా పవన్ సినిమాలలో క్వాలిటీ ఉండటం లేదని ఏదో చుట్టేస్తున్నారని ఒక కళంకం కూడా ఉంది.

అయితే ఆ మాట పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా గురించి అనలేమేమో? ఎందుకంటే ఆ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్ ని రప్పిస్తున్నారట. స్టార్ వార్స్, ఆక్వామాన్, వార్ క్రాఫ్ట్ వంటి భారీ హాలీవుడ్ సినిమాల వీఎఫ్ఎక్స్ కు పనిచేసిన బెన్ లాక్ ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కు పని చేస్తున్నారంట. ఇప్పటికే ఆయన పని కూడా మొదలుపెట్టాడట.

ADVERTISEMENT

ఇందుకోసం నిర్మాత ఏఎం రత్నం గట్టిగానే ఖర్చుపెట్టారట. పవన్ కెరీర్ లో మొట్టమొదటి పీరియడ్ సినిమా ఇది. సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 25 నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో, ఈ చిత్రం డిసెంబర్ లేదా 2022 జనవరిలో విడుదల అవుతుంది.

ఈ చిత్రానికి విరూపాక్షి, వీరమల్లు, హర్ హర్ మహాదేవ్ వంటి టైటిల్స్ వింటున్నాము. ఎంఎం కీరవణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుకుంటున్నారు మరియు ఆయన పవన్ కళ్యాణ్‌తో కలిసి మొదటిసారి. నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని పుకారు ఉంది.

ADVERTISEMENT
Latest Stories