నేను చెప్పిన్నట్లు ప్రభుత్వం పనిచేయాలంటే ఎలా జగన్‌?

కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదంటూ జగన్‌, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ఎంతసేపు ఏడుస్తూనే ఉంటారు తప్ప మ్యానిఫెస్టోలో లేని హామీ ‘కాలేజీ విద్యార్ధులకు మద్యాహ్నం భోజనం పెడుతుండటం గురించి మాట్లాడరు.

తమ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ తీసుకురాలేకపోతే కూటమి ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే సుమారు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రప్పించిందని ఒప్పుకోవడానికి వైసీపీ నేతలకు నోరు రావడం లేదు.

ADVERTISEMENT

జగన్‌ విద్యారంగం మీద పిచ్చి ప్రయోగాలు చేసి విద్యావ్యవస్థని భ్రష్టు పట్టించేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ దానిని గాడిన పెట్టడమే కాకుండా ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రభుత్వ కాలేజీలకు కూడా విస్తరించింది.

ఈ సందర్భంగా విద్యార్ధులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేష్‌తో వారు మాట్లాడుతూ, “ఇంతకాలం ఏ ప్రభుత్వమూ మమ్మల్ని పట్టించుకోలేదు. మాలో చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చినవారిమే. ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటున్నవారిమే.

ఇంతకాలం మద్యాహ్నం భోజనం కోసం మేము ఎన్ని తిప్పలు పడ్డామో, అది మా ఆరోగ్యాలు, చదువులపై ఎంత ప్రభావం చూపిందో మాకే తెలుసు. ఇంత కాలానికి ప్రభుత్వం మా సమస్యని ఈవిదంగా పరిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది,”అని చెప్పారు.

ఇక పరిశ్రమలు, పెట్టుబడులు అంటే కాగితాల మీద లేదా వేదికలపై నాయకుల ప్రసంగాలలో మాత్రమే కనిపిస్తాయి వినిపిస్తాయనుకునే పరిస్థితి నుంచి సాక్షాత్ ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించే స్థాయికి వచ్చాయి. ఈ పని మీదే ప్రధాని మోడీ జనవరి 8న విశాఖ పర్యటనకు వస్తున్నారు. మంత్రి నారా లోకేష్‌ స్వయంగా ఆ ఏర్పాట్లు చేయిస్తున్నారు.

అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమే అనే గుడ్డి భ్రమలో ఉన్న జగన్‌కి, తాను 5 ఏళ్ళలో చేయలేకపోయిన ఈ పనులన్నీ చూడటం, జీర్ణించుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. అందుకే కూటమి ప్రభుత్వం కూడా తన బాటలోనే నడవాలని, సంక్షేమ పధకాలు అమలు చేస్తే చాలన్నట్లు జగన్‌ మాట్లాడుతున్నారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు తాను కోరుకున్నట్లు రాజకీయాలు చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తాను కోరుకున్నట్లే కూటమి ప్రభుత్వం పనిచేయాలని కోరుకోవడం విచిత్రంగానే ఉంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CJP Protests: Is Abhijeet Dipke Justified in Insulting PM Modi?

The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…

5 seconds ago

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

30 minutes ago