
2023 తెలంగాణ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత దశబ్ద కాలం పాటు ఉన్న అధికారాన్ని, పదవిని కోల్పోవడంతో రాజకీయాలకు దూరంగా మౌన దీక్ష చేస్తున్నారు కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో తన కుమార్తె కవిత అరెస్టైన సందర్భం మొదలుకుని ఇప్పటికి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా కేసీఆర్ ఎప్పుడు తీవ్ర స్థాయిలో దాని పై స్పందించలేదు.
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేస్తా, పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మార్చేస్తా, తెలంగాణలో బిఆర్ఎస్ తప్ప మరే పార్టీనైనా తొక్కేస్తా అంటూ భీరాలు పోయిన కేసీఆర్ కనీసం కవితకు బెయిలు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. గత ఎన్నికలలో తన గెలుపుతో పాటుగా ఏపీలో తన మిత్రుడు గెలుపు కూడా సాయమందించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీని కాపాడుకోవడానికి వేరొకరి సాయం కోరుకునే స్థితికి దిగజారారనే చెప్పాలి.
మార్పు మంచిదే అన్నట్టుగా పార్టీ పేరు మార్చి ఒకరు, పార్టీలో నేతల స్థానాలు మార్చి మరొకరు మరోసారి అధికారాన్ని అందుకోవాలి కలలు కన్నారు. అయితే వారి గెలుపు కలలకు ఓటమి నిజాన్ని రుచి చూపించారు ఓటర్లు. ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవడానికి అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఒక్కొక్కరుగా కేసీఆర్ కారు మీద నమ్మకం లేక హస్తం గూటికో, కమలం జట్టుకో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.
మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ కారు ఖాతా కూడా తెరవలేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో మౌనం రాజ్యమేలుతుంది. ఓటమి పై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీ క్యాడర్కు ఆత్మ స్తైర్యాన్ని నింపలేదు. పార్టీ నేతలతో ఓటమి మీద సమీక్షలు జరపలేదు. ఎవరిని నిందించాలో, ఎవరిని బుజ్జ గించాలో, ఎవరి దూషించాలో అర్థంకాకే కేసీఆర్ మౌన దీక్ష చేస్తున్నారా.?
పార్టీ గెలిచినంత కాలం తన మొఖం చూసే ఓటర్లు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటూ గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎవరి మొఖం మీద కోపంతో బిఆర్ఎస్ ను ఫామ్ హౌస్ కు పంపించారో చెప్పగలరా.? ఇదే మౌనంలో కేసీఆర్ మరికొంత కాలం గడిపితే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో టీడీపీ పరిస్థితి మాదిరే మిగిలిపోవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…