అవినాష్ రెడ్డిని జగన్‌ ఎలా కాపాడుకుంటారో?

పదవీ, అధికారం చేతిలో ఉన్నవాడే ఈ భూమ్మీద అత్యంత శక్తివంతుడని జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరూపించి చూపారు. సీఎంవో, సీఐడీ, స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్యాలయాలలో ముఖ్యమైన ఫైల్స్ మాయం అవడం ఇందుకు ఓ చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వివేకా హత్య తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు, ఆ తర్వాత ఆ కేసు సాగిన తీరు, ఆ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్‌ భద్రంగా కాపాడుకొచ్చిన తీరు ఇందుకు చక్కటి నిదర్శనాలు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు పదవీ, అధికారం పోయాయి. ఎన్డీయేలో టిడిపి ప్రవేశించడంతో కేంద్రంతో లింక్ కూడా తెగిపోయింది. పోనీ కేసీఆర్‌ ఏమైనా సాయం చేస్తారా? అంటే ఇప్పుడు ఆయనే అనేక చిక్కులో ఉన్నారు. అందరూ ఊహించిన్నట్లే జగన్‌ అక్రమస్తుల కేసులు, వివేకా హత్య కేసు విచారణలో కదలికలు మొదలయ్యాయి.

అక్రమస్తుల కేసులలో జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని ఇదివరకు రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై త్వరలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

మరోపక్క వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డికి నోటీస్‌ పంపింది.

రెండు రోజుల క్రితం కడప ఎస్పీని కలిసిన, సునీత రెడ్డి మంగళవారం మధ్యాహ్నం శాసనసభకు వచ్చారు. ఆమె హోంమంత్రి వంగలపూడి అనితని కలిసేందుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.

ఆమె మొదట సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేసి, తర్వాత కడప ఎస్పీని కలవడం, ఆ తర్వాత హోంమంత్రి వంగలపూడి అనితని కలిసేందుకు రావడం చూస్తే ఏదో జరుగబోతోందనిపిస్తుంది.

సుప్రీంకోర్టు విచారణ చేసినప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్‌ షరతులు ఉల్లంఘించిన్నట్లు కడప పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పిస్తే బెయిల్‌ రద్దవుతుంది. కనుక దీని గురించే హోంమంత్రి వంగలపూడి అనితతో మాట్లాడేందుకు సునీతా రెడ్డి వచ్చి కలిశారా?లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియవలసి ఉంది.

ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్‌ రద్దు చేసి, పోలీసులు అరెస్ట్ చేస్తే, ఆయన నోరు విప్పితే వివేక హత్య కుట్ర వెనుక ఇంకా ఎవరెవరున్నారు?ఆయన హత్యతో వారికి ఏవిదంగా సంబంధం ఉందనే విషయం భయపెట్టే అవకాశం ఉంటుంది.

ఆవిదంగా జరక్కూడదనే ఇంతకాలం జగన్‌ అవినాష్ రెడ్డిని గాజుబొమ్మలా కాపాడుకుంటున్నారని, షర్మిల, సునీత రెడ్డి, టిడిపి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

కానీ ఇప్పుడు జగన్‌ చేతిలో పదవి, అధికారం, కనీసం కేంద్రంతో కనెక్షన్ లేవు. మరి అవినాష్ రెడ్డిని జగన్‌ ఏవిదంగా కాపాడుకొస్తారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Conversation: Sai Deepak’s U-Turn Triggers Fans?

Mythri Movie Makers has announced a special conversation featuring BJP leader K. Annamalai, lawyer and…

10 minutes ago

Andhra Congress in Crisis: Sharmila’s Test and Jagan’s Dilemma

The INDIA bloc has turned the controversy over SIR and the Election Commission into a…

26 minutes ago