ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్కడ తగులుతాడో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై హీరో నితిన్ చూపించే అభిమానం ప్రధానంగా ఆయా సినిమాల ప్రచారానికి మరియు చిత్ర ఓపెనింగ్స్ కు కారమవుతున్నయన్న విషయం తెలిసిందే. పవన్ ప్రస్తావన లేకుండా ఇటీవల కాలంలో నితిన్ సినిమా ముగియడం లేదు. అది పాట రూపంలో గానీ, సన్నివేశాల రూపంలో గానీ లేదా డైరెక్టర్ రూపంలో గానీ ‘పవన్ కళ్యాణ్’ సెంటిమెంట్ లేకుండా నితిన్ సినిమా ఒప్పుకోవడం లేదనే దాకా ఈ ప్రచారం వెళ్లిందంటే, ఏ మేరకు పవర్ స్టార్ ప్రభావం నితిన్ పై పడిందో అర్ధం చేసుకోవచ్చు.

మరి తాజాగా తానొక సినిమాకు కమిట్ అయ్యానంటూ నితిన్ ట్వీట్ చేసారు. ఈ ఏడాది తొలి హిట్ గా నమోదైన “నేను.. శైలజ…” సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నితిన్ ట్వీట్ చేసారు. ఈ సినిమా శ్రేష్ట మూవీస్ పతాకంపై నిర్మితమవుతుందని, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తానని సమాచారమిచ్చాడు నితిన్.

ADVERTISEMENT

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఏ రకంగానూ పవన్ అంశం ప్రామాణికంగా వినపడడం లేదని సినీ వర్గాల టాక్. సాధారణంగా పవన్ సినిమాల దర్శకులను ఎంపిక చేసుకుంటున్న నితిన్ ఈ సారి రామ్ కు బ్రేక్ ఇచ్చిన కిషోర్ తిరుమలను ఎంచుకోవడం విశేషం. ఇప్పటికీ పవన్ ప్రస్తావన లేకపోయినా సినిమా చివరి దశకు చేరుకునే సమయానికి పవన్ రంగంలోకి ఖాయమే అంటున్నారు అభిమాన వర్గాలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

6 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

10 minutes ago