Telugu

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు గాను ప్రతిపక్ష బిఆర్ఎస్ రేవంత్ సర్కార్ 1000 రోజుల విధ్వంశ పాలన అంటూ మొదలైన ఈ మైండ్ గేమ్స్ అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరశన అంటూ నల్ల చొక్కాలతో గులాబీ సేన అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టిన రాజకీయం లో ముందుగా రేవంత్ పై కేటీఆర్ పై చేయి సాధించారు అనుకునే లోపే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి పిలుపుతూ రేవంత్ తన ఆధిపత్యాన్ని నిరూపించారు.

ADVERTISEMENT

ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఒకసారి బిఆర్ఎస్ మరోసారి కాంగ్రెస్ ఇలా ఒకరి పాలిటికల్ ట్రాప్ లో మరొకరు చిక్కుకుంటూ, ఆ చిక్కులు విడిపించుకుంటూ చివరికి కల్వకుంట్ల ఆస్తుల చిట్టా పొద్దు వరకు వచ్చింది. కొండా సుస్మిత వ్యవహారంతో రేవంత్ అతని సోదరులు అవినీతి అనే అంశం బిఆర్ఎస్ కు ఒక ఆయుధంగా మారింది.

దానితో రేవంత్ టార్గెట్ గా బిఆర్ఎస్ రాజకీయం మొదలుపెట్టింది, ఆ అంశాన్నే మీడియా చర్చలో ఉంచేలా చేసింది. ఈ నేపథ్యంలో తన పై తన కుటుంబం పై బిఆర్ఎస్ చేస్తున్న అవినీతి ఆరోపణలకు సీఎం రేవంత్ తనదైన స్టైల్ లో చెక్ పెట్టారనే చెప్పాలి.

ఆరోపణలు కాదు ఆధారాలు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ భూముల చిట్టా పొద్దులు అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల @440 ఎకరాలు అంటూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న వందల ఎకరాల విలువైన భూముల లెక్కలు ప్రజలు ముందుకు తెచ్చారు, వాటి పై విచారణకు ఆదేశించారు.

కేసీఆర్ మొదలుకుని ఆయన తనయుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, బంధువు సంతోష్ రావు తో సరిపెట్టకుండా కేసీఆర్ సతీమణి, ఆయన మనవడు, మనవరాలు పేరు మీద ఉన్న అధికారిక రికార్డుల ప్రకారం మొత్తం భూముల లెక్కల చిట్టా పొద్దు బయటకు తీశారు.

దీనితో తెలంగాణ రాజకీయాలు రేవంత్ vs కల్వకుంట్ల 2.0 అన్నట్టుగా పరిస్థితిలు మారిపోయాయి. ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు వరుస పెట్టుకుని మీడియా ముందుకొచ్చి కేసీఆర్ మొదటి నుంచి శ్రీమంతుడే అంటూ ఒకసారి, కేసీఆర్ కి హైద్రాబాద్ లో సరైన ఇల్లు కూడా లేని పేదవాడు అంటూ ఒకసారి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటయింది.

దానికి తోడు గతంలో కేసీఆర్ ఆర్థిక పరిస్థితి పై కేటీఆర్, కవిత చెప్పిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బిఆర్ఎస్ నేతలను ఆత్మరక్షణలో పడేసేలా చేసారు కాంగ్రెస్ శ్రేణులు. ఇక ఇప్పుడు ఈ అంశం లో మరోఅడుగు ముందుకు పడిందనే చెప్పాలి.

అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన కేసీఆర్ భూముల వివరాలతో హైద్రాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిసాయి. కల్వకుంట్ల బ్రాండ్ టార్గెట్ గా వెలిసిన ఈ ఫ్లెక్సీలు కేసీఆర్ కుటుంబానికి రాజకీయ నష్టం చేకూర్చే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

హైద్రాబాద్ లో గణేష్ శరన్నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వేలాదిగా రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇటువంటి క్రమంలో కల్వకుంట్ల ఆస్తుల లెక్కలు అంటూ కేసీఆర్ నుంచి మొదలుపట్టి ఆయన మనవడు హిమాంషు వరకు ఆ కుటుంబంలో అందరి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు రోడ్ల మీద పెద్ద పెద్ద పోస్టర్లతో దర్శనమిస్తుండడంతో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల అంశం అటు మీడియాతో పాటుగా ఇటు ప్రజలలోను విస్తృత చర్చనీయాంశం గా మారుతుంది

అయితే ఈ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ల వెనుక ఎవరున్నారన్నది ఇప్పటికి తెలియరాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. ఫ్లెక్సీల వెనుక ఎవరున్నప్పటికీ అధికార పార్టీకి కావాల్సిన అంశం మాత్రం ప్రజలలో చర్చ జరుగుతుంది. మరి ఈ ఫ్లెక్సీలు కౌంటర్ గా రేవంత్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా బయటకు రానున్నాయా.? అనేది చూడాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

6 minutes ago

Vikram’s Release Turns a Joke: No One Ready to Believe?

Finally, Vikram's long pending project Dhruva Natchathiram, directed by Gautham Vasudev Menon, is all set…

18 minutes ago