
వైసీపీ లో ఏ నాయకుడైన తానున్న స్థానం నుంచి ప్రమోషన్ పొందాలి అనుకుంటే అయితే ఒకటి ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద బూతులతో విరుచుకుపడాలి, ఆయా పార్టీల నేతల ఇళ్ల మీద కర్రలతో దాడులకు తెగబడాలి, లేకుంటే వైస్ జగన్ కు వీరవిధియుడిగా ఉంటూ ఆయన అడుగులకు మడుగులు వెయ్యాలి అనే నియమనిబంధనలు ఉంటాయనుకుంటా.
ఆ నియమాలకు లోబడే పార్టీ అధినేత వైస్ జగన్ వారికి పదవులు కట్టబెడతారు అనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఆ ప్రచారానికి బలం చేకూరేలా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైసీపీ పార్టీ అధినేతగా వైస్ జగన్ కొంతమంది బూతు నాయకులకు, అరాచక నేతలకు పదవులు కట్టబెట్టారు.
అందులో ముఖ్యంగా కొడాలి నాని మొదటి స్థానంలో ఉంటారు. ఆయనకు బాబు, లోకేష్ లను తిట్టనిదే పొద్దు గడిచేది కాదు. ఆ స్థాయిలో కొడాలి జగన్ ను తన బూతులతో మెప్పించారు గనుకనే కొడాలికి పౌరసరఫరాల శాఖ మంత్రిగా పదవి దక్కిందనే టాక్ నడిచింది.
ఇక జోగి విషయంలో కూడా ఇదే నిబంధన అప్లై అయినట్టు సమాచారం. ఉండవల్లి బాబు ఇంటి మీదకు కర్రలతో దాడికి తెగబడినందుకే జోగి రమేష్ కు హోసింగ్ మినిస్టర్ గా జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారనేది అందరు ఒప్పుకునే వాస్తవమే.
ఇక అంబటి, పేర్ని నాని కూడా జగన్ మెప్పు కోసం సొంత సామాజికవర్గాన్ని కూడా కించపరుస్తూ పవన్ పై దూషణలు చేసినందుకు వారిద్దరికీ జగన్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, జలవనరుల శాఖ మంత్రులుగా పదవులు దక్కాయి.
అలాగే పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం పెట్టి మరి అనాలోచితంగా, అసందర్భంగా పవన్ ను ఆయన కుటుంబాన్ని కూడా నీచాతి నీచంగా దూషించిన ఫలితంగా ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ FDC ఛైర్మన్ పదవి దక్కింది.
ఇక రోజా తన బూతు సైగలతో, చిల్లర మాటలతో అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలను రెచ్చకొట్టినందుకు, రెచ్చిపోయినందుకు గాను ఆమెకు పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇలా జగన్ వైసీపీ లో రాజకీయ హద్దులు చెరిపేసి దిగజారి ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని అందలం ఎక్కించారు, ప్రభుత్వంలో భాగం చేసారు.
మరి ఇప్పుడు వైసీపీ దృష్టిలో ఒక మెట్టెక్కి, ప్రజల దృష్టిలో నాలుగు మెట్లుదిగిన అంబటి ఏకంగా ముఖ్యమంత్రి పైనే బూతులతో తెగబడితే అందుకు అంబటికి వైసీపీ లో ప్రమోషన్ దక్కుతుందా.? పార్టీ కి అంబటి చేస్తున్న ఈ సేవలకు జగన్ వద్ద అంబటి గౌరవం పెరుగనుందా.?
Koffee with Karan may be ending but Karan Johar is not ready to say goodbye…
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…