
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణలో జరుగుతున్న చర్చలు రోజుకో టాపిక్ తో మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ అరెస్టు తో మొదలైన ఈ హడావుడి బన్నీ ఇంటి మీద దాడి వరకు కొనసాగుతూనే ఉంది.
అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున తమ వాదనను వినిపించిన ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు, వాటిని సమర్థిస్తూ పోలీస్ బాసులు పెట్టిన ప్రెస్ మీట్లు ఇలా ప్రతి అంశం వివాదానికి పరిష్కారం చూపకపోగా మరో కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చాయి.
అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు భాద్యులెవరన్నది ఈ వీడియో చూసి విజ్ఞులైన ప్రజలే నిర్ణయించుకోవాలంటూ బన్నీ కి సంబంధించిన వీడియో ను బయటకు విడుదల చేసారు హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గాను తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వారితో అనుచితంగా వ్యవహరించారు సీపీ.
ఈ జరిగిన ఘటనలో తమ వాదన కూడా ప్రజలకు వినిపించాలి అనుకున్న సీవీ ఆనంద్ అందుకు నేషనల్ మీడియా సహకరించడం లేదనే భావనతో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ వ్యాఖ్యానించి నోరు జారారు.
అయితే సదరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు రెచ్చకొట్టేలా ఉండడంతోనే అలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటూ చేసిన పొరపాటును వెంటనే సరిదిద్దుకునేలా నేషనల్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు తెలియచేసారు ఆనంద్.
అయితే ఈ ఘటన విషయంలో తన పై ప్రభుత్వం నుండి, పోలీస్ అధికారుల నుండి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైన అల్లు కుటుంబం సంయమనాన్ని కోల్పోయి తొందరపాటు ప్రెస్ మీట్లకు నాంది పలికారు. అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయంలో ఉడుం పట్టుపట్టి వివాదాన్ని మరికాస్త సాగదీస్తున్నారు.
ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు సెలబ్రేటీకి ఇటు ప్రభుత్వానికి, మీడియాకు మధ్య వారధిలా పని చేసే పోలీస్ బాసులు కూడా ఒత్తిడిని తీసుకోలేక ఇలా తమ విచక్షణను మరిచి నోరు జారీ క్షమాపణలు అడిగే పరిస్థితులను తెచ్చుకుంటున్నారు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…