
హైదరాబాద్‌లో నేటి నుంచి రెండు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు గోల్కొండ కోట సమీపంలో గోల్ఫ్ క్లబ్ వద్ద ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభించి కాసేపు దానిలో ఆకాశమార్గంలో విహరించారు.
హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిమంది ప్రజలు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివలలో పాల్గొనేందుకు తరలివచ్చారు. అనేకమంది హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలో విహరించారు. ఈ ఆదివారం వరకు గోల్కొండ వద్ద ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది.
హైదరాబాద్‌లో ఇప్పటికే పలు పర్యాటక ఆకర్షణలున్నాయి. అవి కాకుండా అప్పుడప్పుడు ఈవిధంగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, హుస్సేన్ సాగర్‌లో యాటింగ్ ఫెస్టివల్ వంటివి నిర్వహిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వ హయంలో ఫార్ములా-1 కార్ రేసింగ్ ఈవెంట్ కూడా అట్టహాసంగా జరిగింది.
ఈ లెక్కన సుమారు 1500 కిమీ పొడవైన సముద్ర తీరం, జిల్లాల మద్య పారే కృష్ణా, గోదావరి తదితర నదులు, వాటి ఉప నదులు, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం ఏ స్థాయిలో ఉండాలి?
హైదరాబాద్‌లో ఇన్ని ఈవెంట్స్ నిర్వహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నప్పుడు, ఇన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని ఈవెంట్స్ నిర్వహించాలి?
ఏపీలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహణకు అత్యంత అనుకూలమైన వాతావరణం, అందమైన నగరాలు, పట్టణాలు, పల్లెలు, నదులు, సముద్ర తీరం ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే హైదరాబాద్ వరకు వచ్చిన హాట్ ఎయిర్ బెలూన్ నిర్వాహకులను ఏపీకి రప్పించడం పెద్ద కష్టం కాదు కదా?
Unlike the usual approach seen in recent times, the makers of The Paradise have chosen…
Tamil cinema has not had a great run with big-ticket sequels. The first film works,…