హైదరాబాద్ బిచ్చగాళ్ళపై షాకింగ్ స్టోరీ..!

hyderabad bonthu rammohan comments beggarsఇటీవల తెలుగులో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘బిచ్చగాడు’ చూసారా..! కోట్ల రూపాయల ఆస్తిని పక్కన పెట్టి, తన తల్లి కోసం ఒక దీక్ష పూని, బిచ్చగాడిగా మారిన ఒక నిజజీవిత గాధ అది. అయితే సీన్ కట్ చేసి, హైదరాబాద్ కు వస్తే… బిక్షాటనం చేస్తూ కోట్ల రూపాయల ఆదాయానికి కారణమవుతున్నారు బిచ్చగాళ్ళు. హైదరాబాద్ బిచ్చగాళ్ళపై హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తాజాగా ఓ అవాక్కయ్యే వాస్తవాన్ని వెల్లడించారు.

నగరంలో ప్రధాన కూడళ్ళలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, దేవాలయాల వద్ద సంచరించే యాచకులంతా కలిసి నెలకు దాదాపుగా రెండు కోట్ల రూపాయలను వసూలు చేస్తారట. అంటే ఏడాదికి దాదాపు 24 కోట్ల రూపాయలను యాచకులు ప్రజల వద్ద నుండి వసూలు చేస్తున్నారని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలివి. ఈ బిచ్చగాళ్ళల్లో ఏ వృత్తి లేకుండా నిజంగా యాచక అవతారంలో ఉన్నదీ కేవలం 2 శాతం మాత్రమేనట.

ADVERTISEMENT

మిగతా వారంతా ఏదొక వ్యాపారం చూస్తూ ఈ యాచక వృత్తిలోకి దిగారట. హైదరాబాద్ లో ఉన్న యాచకులను నిర్మూలించాలన్న కార్యక్రమంపై ఈ నెల 23వ తేదీన జీహెచ్ఎంసీ మరియు పోలీస్ అధికారులు సమావేశమై చర్చలు జరపనున్న నేపధ్యంలో… నగరంలోని బిచ్చగాళ్ళపై మేయర్ ఒక నివేదికను తెప్పించుకున్నారు. అందులో భాగంగా వెల్లడైన వాస్తవాలు అవి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో యాచకవృత్తిని నేరంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. బహుశా అలాంటి చట్టాన్ని ఏమైనా రూపొందిస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories