
స్నేక్ గ్యాంగ్ లైంగిక దాడులు చేశారని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని, వీరెవరూ అత్యాచారాలకు పాల్పడినట్టు ఆధారాలు లేవని న్యాయమూర్తి ప్రకటించడం బాధితులకు విస్మయాన్ని కలిగించే అంశంగా మారింది. కేవలం దోపిడీ, అసభ్య ప్రవర్తన ఆరోపణలపైనే వీరు ముద్దాయిలుగా తేలారని, బుధవారం నాడు వీరికి శిక్షలను ఖరారు చేస్తామని న్యాయమూర్తి పేర్కొనడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు విచారణలో సాక్ష్యాలు లభించకపోవడం పట్ల తెరవెనుక ఎలాంటి రాజకీయాలు జరిగాయో అన్నది ఆసక్తికరంగా మారింది. అది కూడా 9 మంది సభ్యులలో ఏ9గా ఉన్న సలాం హందీ అనే వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం విశేషం.
2014లో పాములు చేతబట్టిన స్నేక్ గ్యాంగ్… ఏకాంతం కోసం నిర్జన ప్రదేశాలకు వెళ్లే ప్రేమ జంటలే లక్ష్యంగా స్వైర విహారం చేసి, దాదాపు 37 జంటలపై దాడులకు దిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ముఠాలోని ఓ సభ్యుడు పాముతో యువ జంటను బెదిరిస్తే… మిగిలిన సభ్యులు జంటలోని ప్రియుడికి చితకబాదేవారని, ఆ తర్వాత గ్యాంగ్ లోని ఒక్కొక్కరు యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడేవారని, ఈ ఘటనను సెల్ ఫోన్ చిత్రీకరించిన ఈ ముఠా… బయట నోరు విప్పితే వీడయో నెట్ లో కొచ్చేస్తుందని బెదిరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఓ జంటలోని యువతి మాత్రం ధైర్యం చేసి 2014 జూలై 31న పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేసి సమగ్ర సాక్ష్యాలతో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 21 మంది సాక్షులను విచారించిన కోర్టు 8 మందిని దోషులుగా పేర్కొంది. ఈ తీర్పు పై పెదవి విరుస్తున్న ప్రజానీకం, భయంకరమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఈ గ్యాంగ్ పై కనీసం ఒక్క అత్యాచార ఆరోపణనైనా పోలీసులు నిరూపించలేక పోయారని పలువురు కోర్టు ప్రాంగణంలోనే విమర్శించారు.
Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…
Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…