Telugu

వినేవాడు లేడు…వినిపించుకునే వాడు రాడు..!

ప్రభుత్వాల నిర్ణయాలతో ప్రజలు రోడ్ల మీదకు వస్తే వారి గోడు వినడానికి అధికార పార్టీనాయకులు ముందుకు రారు. అయితే ఆ బాధితుల భాదను వినిపించుకునేది ప్రతిపక్ష పార్టీలే, ఆ పార్టీల నాయకులే. అయితే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా బాధితుల గోడు వినడానికి అడుగు ముందుకు వేయలేకపోయాయి.

హైడ్రాతో హైద్రాబాద్ వాసుల కష్టాలు పెరుగుతున్న వరదల మాదిరి రోజురోజుకి పెరుగుతూ ప్రజలను ముంచేస్తున్నాయి. వారి కన్నీటి గోషలు వినేవారు లేక, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఓటేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ, బాధ్యత లేని ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ నిత్యం భయం గుప్పిట్లో సూర్యోదయం చూస్తున్నారు బాధిత ప్రజలు.

ADVERTISEMENT

ప్రభుత్వాలు ఆక్రమణలు తొలగించడం తప్పు కాదు, అయితే అవి ఆక్రమణలు అని తెలిసి వాటికీ అనుమతులిచ్చిన ఎవరిని శిక్షించకుండా, కేవలం వారి అనుమతులతో లక్షలలో లోన్లు తీసుకుని నిర్మించుకున్న సొంత ఇళ్లను కళ్ళ ముందే కూల్చేస్తుంటే వారి కన్నీటికి ఏ ప్రభుత్వ అధికారి సమాధానం చెప్పగలరు.?

నమ్మి ఓటేసిన ప్రభుత్వమే మమ్మల్ని నిండా ముంచింది అంటూ వారు పెట్టె శాపనార్దాలకు ఎవరు బలికావాలి.? తెలియక చేసిన తప్పుకి జీవితికాల కష్టం హైడ్రా పాలవుతుంది అంటూ కుటుంబాలకు కుటుంబాలే నడి రోడ్డు మీద ధీనంగా రోధిస్తున్నాయి. ఎవరిని సాయమడగాలి .? ఎవరిని పరిహారం కోరాలి.? అంటూ కన్నీటితో సమాధానం చెప్పలేని ప్రశ్నలను సంధిస్తూ చేయూత నిచ్చే మనిషి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే వారి రోధనకు ప్రభుత్వాలు కదిలి రాకపోయినా కనీసం పదేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ కూడా ముందుకు రాకపోవడం ఇక్కడి ప్రజలకు రాజకీయ పార్టీల మీద, ఆయా పార్టీల నాయకుల మీద నమ్మకాన్ని దూరం చేస్తున్నాయి. హైడ్రా బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ కేటీఆర్ చేసిన ప్రకటన, ప్రకటన రూపంలోనే ఉంది కానీ ఎక్కడ వాస్తవంలో కనిపించడం లేదు.

దీనితో అటు వినేవాడు లేడు… ఇటు వినిపించుకునే వాడు రాడు అంటూ హైడ్రా బాధితులు అటు అధికార పక్షాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని కూడా తప్పుబడుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 Hindi: OTT Destroyed Hrithik Roshan’s Cameo?

Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…

42 minutes ago

Pics: Janani Makes Black And White Look Hot!

Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…

1 hour ago