
కేసీఆర్, కేటీఆర్ బాధితులలో ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు. బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో వందల కోట్లు పంచి పెడుతూ, ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకోవడంపై అప్పుడే విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత రేవంత్ రెడ్డిని జైలుకి పంపించడం, బెయిల్‌పై వచ్చి కూతురు పెళ్ళి చేసుకుంటుంటే అది పూర్తికాక ముందే బలవంతంగా జైలుకి తరలించడం, ఇంకా గత పదేళ్ళలో అనేక కేసులు, వేధింపులు, అవమానాలు… కేసీఆర్ బాకీ తీర్చుకోవలసినవి రేవంత్ రెడ్డి వద్ద చాలానే ఉన్నాయి.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలపై సమాంతరంగా విచారణలు జరిపిస్తున్నారు. కనుక వాటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్‌ని అరెస్ట్ చేయకమానరని అందరూ అనుకుంటున్నదే.
కానీ కేసీఆర్ కంటే ముందుగా ఆయన కుమారుడు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని అరెస్ట్ చేయవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చూచాయగా చెప్పారు. “దీపావళి పండుగకు ముందు కొన్ని బాంబులు పేలబోతున్నాయి” అంటూ అరెస్టుకి ముహూర్తం కూడా ప్రకటించేశారు.
మాజీ మంత్రిగా చేసిన కేటీఆర్‌కి ఈపాటికి ఈ సమాచారం అందే ఉంటుంది. కనుక ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జైలుకి వెళ్ళేందుకు నేను సిద్దంగా ఉన్నాను. కానీ మళ్ళీ మాపార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము వడ్డీతో సహా చెల్లిస్తే తీసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు సిద్దంగా ఉన్నారా లేదా?” అని ప్రశ్నించారు.
కేటీఆర్ నోట తన అరెస్ట్ గురించి మాట రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అరెస్టుకి రంగం సిద్దం చేసిన్నట్లే అనిపిస్తోంది.
అయితే ఏ కేసులో అరెస్ట్ చేసి జైల్లో వేసినా బెయిల్‌పై వచ్చేసే వెసులుబాటు ఉండనే ఉంది. కనుక ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌ని అరెస్ట్ చేయిస్తే, మహా అయితే ఒకటి రెండు నెలలు జైల్లో ఉంచగలదేమో? కానీ అరెస్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాలలో పరిణామాలు, సమీకరణాలు, బలాబలాలు అన్నీ మారే అవకాశం ఉంటుంది.
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…