
కేసీఆర్ కుమార్తె తండ్రికి, అన్నకి, పార్టీకి దూరమైన తర్వాత ఆమె తెలంగాణ జాగృతితో రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు గడువు విధించింది. కానీ ఇంతవరకు తండ్రి కేసీఆర్ నుంచి పిలుపు రాలేదు. ఎటువంటి రాయబారం జరుగలేదు. కనుక ఆమె తెలంగాణ జాగృతి అభ్యర్ధులను బరిలో దించేందుకు సిద్దమవుతున్నారు.
శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఆమె ‘రాజకీయ లీడర్స్’ శిక్షణ సదస్సు నిర్వహించారు. దానిలో ఆమె మాట్లాడుతూ ‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తామని’ చెప్పారు. అంటే ఇక బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని సమయం వృధా చేసుకోవడం అనవసరమని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ సందర్భంగా ఆమె శిక్షణ కోసం వచ్చిన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పుట్టుకతోనే ఎవరూ నాయకత్వ లక్షణాలతో పుట్టరు. అలాగే లీడర్లు ఆకాశంలో నుంచి ఊడిపడరు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, తనని తను మార్చుకుంటూ ముందుకు వెళ్ళేవారే లీడర్లుగా ఎదగగలుగుతారు.
కానీ ఈరోజుల్లో నాయకులు అంటే కేవలం పదవులు సంపాదించుకోవడం, ప్రత్యర్దులపై అసభ్యకరంగా నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది.
కనుక తెలంగాణకు కొత్త తరం నాయకులను తయారుచేసి అందించాలనే లక్ష్యంతోనే తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆగస్ట్ నుంచి అన్ని జిల్లాలో ‘లీడర్ శిక్షణా కార్యక్రమాలు’ నిర్వహిస్తాము,” అని చెప్పారు.
కల్వకుంట్ల కవిత నిసందేహంగా ఒక సమర్దురాలైన రాజకీయ నాయకురాలు. లిక్కర్ స్కాములో ఆర్నెల్లు జైల్లో ఉండి వచ్చి, పదవులు, ప్రాధాన్యత కోసం తండ్రితో విభేదించి బయటకు వచ్చి ‘మంచి లక్షణాలున్న లీడర్ల’ను తయారు చేస్తానని చెప్పడమే చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఇటీవలే ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఇదివరకు బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంటే జోరు తగ్గించమని తండ్రి ఆదేశిస్తే తగ్గించామని ఆమె స్వయంగా చెప్పారు. కనుక ఒకవేళ రేపు ఏదోరోజు తండ్రి నుంచి పిలుపువస్తే ఆమె తెలంగాణ జాగృతి దుకాణం మూసేసి, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళకుండా ఉంటారా?
వెళ్తే… ఆమె రాజకీయ కాలక్షేపం కోసం ఈవిదంగా ఏదో చేస్తుంటే ఆమెను నమ్ముకొని వెంట తిరిగేవారే పరిస్థితి ఏమిటి?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…