
ఏపీ, తెలంగాణలు భౌగోళికంగా విడిపోతున్నప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందామని ఆనాడు బీఆర్ఎస్ నేతలు సుద్దులు చెప్పారు. కానీ వారు అధికారంలో ఉన్న 12 ఏళ్ల పాటు ఏపీ పట్ల తెలంగాణ ప్రజల్లో విద్వేష భావాలు రగిలిస్తూనే ఉన్నారు. నేటికీ వారి ధోరణి మారనే లేదు.
పైగా తెలంగాణలో రాజకీయంగా పైచేయి సాధించాలంటే ఇదే సరైన ఫార్ములా అన్నట్లు మార్చేశారు. దీని కోసం చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇడుపు కాయితం పేరుతో చేస్తున్న రాజకీయాలే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ ద్వేష భావనలు పుణికిపుచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ అవకాశాన్ని వదులుకోలేదు.
“ఈ పదానికి అర్థం తెలియకపోతే వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అడగండి. ఆయనకు బాగా తెలుసు, చెబుతారు” అంటూ వ్యంగ్యంగా అన్నారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి “ఆయన కార్లు మార్చినంత తేలికగా భార్యలను మార్చేస్తారు” అంటూ చాలా చులకనగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయించారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే.
ఇదివరకు తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్, ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ మాటల్లో కూడా ఇదే రకమైన అహంభావం, రాజకీయ ప్రత్యర్థుల పట్ల చులకన భావం, వెటకారం కనిపిస్తుంటాయి. కల్వకుంట్ల కవిత కూడా ఆ గూటి చిలుకే కనుక అదే భాష, అదే ఫార్ములాతో లక్ష్యం సాధించగలనని భావిస్తున్నట్లున్నారు.
‘ఇడుపు కాయితం’ పేరుతో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత చాలా చులకనగా మాట్లాడారు. అయితే ఈ పేరుతో కూడా రాజకీయ మైలేజ్ పొందాలనే ఆమె ఆరాటం చూస్తే నవ్వొస్తోంది.
తెలంగాణ భాష, సంస్కృతిపై దాడి చేస్తామంటే చూస్తూ సహించే ప్రసక్తి లేదని ఆమె చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఏదో రాస్తే తెలంగాణ భాష, సంస్కృతిపై దాడి జరిగిపోతోందని, నేను నా ప్రాణాలు అడ్డేసి తెలంగాణను కాపాడుకుంటానన్నట్లు ఆమె మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
తెలంగాణలో రాజకీయంగా పైచేయి సాధించాలంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పోరాడి పైచేయి సాధించాలి. కానీ తెలంగాణలో మూడు పార్టీలు ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని రాజకీయంగా పైచేయి సాధించాలని ఆరాటపడుతుంటాయి. ఇది వారికే అవమానకరం అని ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో?
#IdupuKayitham అంటే ఏంటో తెలియదంటూ Troll చేస్తున్నారు.
అర్థం కావాలంటే #PawanKalyan ని అడగండి. కచ్చితంగా చెప్తాడు.
– #Kavitha targets PK, again! pic.twitter.com/aC766oFUIQ
— M9 NEWS (@M9News_) June 28, 2026
Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…
The makers of the 2018 youth entertainer ‘Husharu’ have officially announced its sequel, ‘Husharu 2’.…