
నేను గెలవాలి కంటే మనం గెలవాలి అనుకోవడం గొప్పగా ఉంటుంది. మనతో పాటు అందరం గెలవాలి అనుకోవడం ఇంకా గొప్పగా ఉంటుంది. రాజకీయాలలో ఇది సాధ్యపడకపోవచ్చు కనుక మన పార్టీ, కూటమి గెలవాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మనం గెలవాలని కోరుకునే బదులు ఎదుట పార్టీ ఓడిపోవాలని కోరుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. మొదటి నుంచి వైసీపి వైఖరి ఇలాగే కొనసాగుతోంది.
ఇందుకు తాజా నిదర్శనంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాజా వ్యాఖ్యలున్నాయి. “రాబోయే ఎన్నికలలో టిడిపి ఓడిపోతే జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళుతుంది. కనుక జూ.ఎన్టీఆర్ కోసమైనా టిడిపిని ఓడించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
వైసీపి గెలవాలని కోరుకునే బదులు టిడిపి ఓడిపోవాలని కోరుకోవడం ఆ పార్టీ నేతల మనోవైఖల్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. వైఎస్ షర్మిలని తీసుకువచ్చి తమ కుటుంబంలో ప్రతిపక్షాలు చిచ్చుపెడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ నందమూరి, నారా రెండు కుటుంబాలలో, టిడిపిలో, నందమూరి అభిమానుల్లో కూడా ఈవిదంగా చిచ్చుపెట్టాలనుకోవడం వారు తప్పుగా భావించరు.
జూ.ఎన్టీఆర్ తనకు ఆప్తమిత్రుడని కొడాలి నాని చెప్పుకుంటారు. కానీ టిడిపిని దెబ్బ తీయడం కోసం రాజకీయాలకు దూరంగా ఉంటున్న తన స్నేహితుడిని కూడా కొడాలి నాని తమ వైసీపి రాజకీయాలలో పావుగా వాడుకోవా దురాలోచన చేస్తున్నారు.
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించి తన అన్న జగన్మోహన్ రెడ్డిని, వైసీపి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ఒకప్పుడు వైసీపిని కాపాడింది ఆమేనని, ఆమె వలననే తామందరం ఈనాడు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్నామనే సంగతి మరిచిపోయిన కొడాలి నాని వంటివారు, ఆమెను నోటికి వచ్చిన్నట్లు అవహేళన చేస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ కోసం మొసలి కన్నీరు కార్చుతున్న వైసీపి నేతలు వైఎస్ షర్మిల విషయంలో మరోవిదంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?వారి ద్వందవైఖరిని ప్రజలు గమనించడం లేదనే చులకన భావంతోనే కదా?
తెలంగాణలో పదేళ్ళపాటు రాజ్యమేలిన కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు కూడా ప్రతిపక్ష నేతలతో ఇదేవిదంగా చులకనగా, అవహేళనగా మాట్లాడేవారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏవిదంగా ఉందో వైసీపి నేతలు కూడా చూస్తూనే ఉన్నారు. అయినా ఎవరూ నోరు అదుపులో పెట్టుకోవడం లేదు. బుద్ధులు కూడా మారడం లేదు. ప్రతిపక్ష నేతని పట్టుకొని కార్లు మార్చిన్నట్లు పెళ్లాలను మార్చుతారని జగన్ అవహేళన చేస్తుంటే, ఆయన చెల్లెలు షర్మిలని ఉద్దేశ్యించి వైసీపీ నేతలు చులకనగా మాట్లాడుతుంటారు.
ఈవిదంగా మాట్లాడుతూ, వ్యవహరిస్తుంటే రేపు ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే, తమ పార్టీ పరిస్థితి, తమ పరిస్థితి, ముఖ్యంగా కొడాలి నాని పరిస్థితి ఏమిటి?అనే ఆలోచన చేస్తున్నారా?అంటే లేదనే కొడాలి చెబుతున్నారు. బిఆర్ఎస్ ఓడిపోయినా తెలంగాణలోనే ఉండగలుగుతోంది. కానీ వైసీపి ఓడిపోతే వైసీపీ నేతలు రేపు ఏపీలో ఉండగలరా?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…