పార్టీలో ఉంటే ఉండొచ్చు.. పోతే పోవచ్చు: సజ్జల

వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న నియోజకవర్గం ఇన్‌చార్జిలతో తాడేపల్లిలో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాము. అలా ఎందుకు చేస్తున్నామో కూడా ఎమ్మెల్యేలకి, నియోజకవర్గం ఇన్‌చార్జిలకు వివరించి చెపుతున్నాము.

అయితే వైసీపిలో తమకు భవిష్యత్‌ లేదని భావించేవారు, పార్టీ అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నవారు, వివిద కారణాలతో అసంతృప్తిగా ఉన్నవారు పార్టీని వీడి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఏ రాజకీయ పార్టీలోనైనా ఇటువంటివి మామూలే.

ADVERTISEMENT

కనుక అటువంటి వారి బయటకు వెళ్ళిపోతేనే మంచిది. పార్టీలోనే ఉంటే వారి వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. ఒకరు పోతే వారి స్థానంలో మరొకరిని నియమించుకొంటాము. వైసీపి రాజకీయంగా చాలా బలంగా ఉంది. ఫుల్ ఫామ్‌లో ఉంది. కనుక రాబోయే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.

వైసీపి చాలా బలంగా ఉంది. ఫుల్ ఫామ్‌లో ఉందని చెప్పుకొంటునప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని, నియోజకవర్గం ఇన్‌చార్జిలని పక్కన పెట్టడం, మార్చడం దేనికి?ఏ పార్టీలోనైనా ఇటువంటి అసంతృప్తులు సహజమే అని సజ్జల రామకృష్ణా రెడ్డి సమర్ధించుకోవడం బాగానే ఉంది. కానీ ‘అటువంటివారు పార్టీలో ఉంటే ప్రమాదం… వారు బయటకు పోతేనే మంచిదని ఆయనే చెప్పేశారు.

తంబళ్ళపల్లి వైసీపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి వాలంటీర్లను వాలంటీర్లను ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘ఉంటే ఉండండి… పోతే పొండి… మీరుపోతే వాలంటీర్లుగా పనిచేయడానికి అనేక మంది సిద్దంగా ఉన్నారు,” అంటూ చాలా చులకనగా మాట్లాడారు.

ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలని ఉద్దేశ్యించి అదేవిదంగా మాట్లాడుతున్నారు. తమ కిందవారిని చులకనగా చూసే లక్షణం బహుశః వైసీపి డీఎన్ఏలోనే ఉందేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

3 hours ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

4 hours ago