
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. డేటింగ్ లో ఉన్న వీరిద్దరికీ వివాహం అయిపోయిందంటూ గతంలో బాలీవుడ్ వర్గాలలో వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ అవేమీ నిరూపణ కాలేదు. అయితే తాజాగా పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలతో ఇలియానా వివాహం అయిపోయి ఉంటుందన్న ప్రచారం బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినపడుతోంది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి లిప్ లాక్ చేసుకున్న ఫోటోలను వీడియో రూపంలో రూపొందించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.
ఇప్పటివరకు చేతిలో సినిమాలు ఉండడంతో కాస్త అణిగిమణిగి ఉందని, ప్రస్తుతం ఏ ‘వుడ్’లోనూ సినిమాలు లేకపోవడంతో, తన అసలు రూపం మరియు విశ్వరూపం ఇలియానా చూపిస్తోందని నెటిజన్లు చేస్తున్న కామెంట్లు కోకొల్లలు. మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నానని ఇలియానా చెప్పకనే చెప్తోంది. అంతేలెండి… ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో జరగాలని పెద్దలు ఉరకనే అన్నారా..!
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…