
భారత్‌కు చైనా, పాకిస్థాన్‌లు ఎప్పుడూ పక్కలో బల్లెంలానే ఉన్నాయి. ఉంటాయి కూడా. కానీ లక్షలాదిమంది భారతీయులు జీవితాలలో అనూహ్యంగా ఎదిగేందుకు తోడ్పడింది అమెరికా. ఇప్పుడు అదే అమెరికా భారత్ స్టాక్ మార్కెట్లని కొలుకోలేనంతగా దెబ్బతీస్తోంది.
గమ్మత్తైన విషయం ఏమిటంటే, చైనా సరుకుతో భారతీయ పరిశ్రమలు దివాళా తీస్తుంటే వాటిలో పని చేస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారు. భారత్ పరిశ్రమలను, కార్మికులను ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న చైనా మరోపక్క భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు ఆయుధాలు సమకూర్చుతోంది.
పాక్ ఉగ్రవాదులను తయారుచేసి భారత్‌లో దాడులకు పంపిస్తుంటే, ఆ దేశానికి చైనా ఆయుధాలు అందించి భారత్‌ని దెబ్బతీస్తోంది. మరోపక్క దేశ సరిహద్దులను చెరిపివేసి కబాళించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
చైనా తయారుచేసుకున్న ఆయుధాలను పరీక్షించుకొని మెరుగు పరుచుకునేందుకు భారత్‌ను పరీక్షా కేంద్రంగా, ప్రజలను బలిపశువులుగా చైనా వాడుకుంటోందని ఇటీవలే ఓ భారతీయ సైన్యాధికారి చెప్పిన సంగతి తెలిసిందే. అయినా భారతీయులు చైనా వస్తువులు కొనుగోలు చేయడం మానుకోవడం లేదు. భారత్ ప్రభుత్వం కూడా చైనా ఉత్పత్తులను అడ్డుకోవడం లేదు.
చైనా సృష్టించిన కరోనా మహమ్మారి భారత్‌తో సహా ప్రపంచ దేశాలను, ఆర్ధిక మూలాలను, కోట్లాదిమంది ప్రజల ప్రాణాలను ఏవిదంగా హరించిందో అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. నాడు కరోనా బారినపడినవారు ప్రాణాలతో బయటపడినా ఆ ప్రభావం వల్లనే నేటికీ ప్రజలు చనిపోతూనే ఉన్నారు.
అమెరికా విషయానికి వస్తే, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు ఒక పక్క, మరోపక్క ఓ ప్రముఖ అమెరికా కంపెనీ చేసిన మోసాల వలన భారతీయ స్టాక్ మార్కెట్స్ కనీవినీ ఎరుగని విధంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా చిన్న మదుపరులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్లలో కోట్లు కుమ్మరించిన బడా వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారతీయ పరిశ్రమలు, ఎగుమతి దిగుమతులు, స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉండేవి. కానీ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, ఫార్మా, బట్టలు, ఆహార ఉత్పత్తులు ప్రతీ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నాయి.
ఈ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు చాలా అనిశ్చితంగా మారాయి. సుంకాలు విధింపు గడువు (జూలై 9) గడువు ముగుస్తుండటంతో ట్రంప్ మళ్ళీ ఏం బాంబు పేలుస్తారో అనే భయంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కదలకుండా నిలబడిపోయాయి. యింది.
వీటికి తోడు భారత్-పాక్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధాలు, దేశాల ఆర్ధిక పరిస్థితిని మరింత దయనీయంగా మార్చాయి. ఇన్ని యుద్ధాలు జరిగినా సాధించిందేమీ లేదు. ఎవరూ ఎవరినీ జయించలేదు. కానీ జరగకూడని నష్టం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ట్రంప్ వంటివారి వలన ప్రపంచం దేశాలలో మారుమూల ప్రాంతాలలో నివాసిస్తున్నవారు సైతం వారికి తెలియకుండానే మూల్యం చెల్లించాల్సి వస్తుండటం చాలా బాధకరమే కదా?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…