
భారత్ త్రివిధ దళాలు మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత (1.44 గంటలకు) పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మెరుపు దాడి చేసి సరిహద్దు నుంచి వంద కిలోమీటర్లు లోనికి చొచ్చుకు వెళ్ళి అక్కడున్న జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజయాహుద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలను ధ్వంసం చేశాయి.
ఆర్మీ, వాయుసేన క్షిపణులతో దాడి చేసి మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. భారత్ దాడి చేస్తే ధీటుగా ఎదుర్కొనేందుకు తమ ఆర్మీ, వాయుసేన సిద్దంగా ఉన్నాయని ప్రగల్భాలు పలికిన పాక్ పాలకులు భారత్ మెరుపు దాడి చేయడంతో బహుశః నివ్వెరపోయి ఉంటారు.
కనుక వారు తేరుకొని నేడో రేపో లేదా త్వరలో భారత్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నించవచ్చు. కనుక భారత్ త్రివిధ దళాలు కూడా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉన్నాయి.
ముందస్తు జాగ్రత్త చార్యలలో భాగంగా పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న అమృత్‌సర్, జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ విమానాశ్రయాలకు విమానాల రాకపోకలు జరుగవు.
గత నెల 22న పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులలో 26 మంది పురుషులను వేరు చేసి వారి భార్యల ముందే కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఆ మహిళల నుదట బొట్టు చెరిపేశారు గనుక ఆ మహిళల ప్రతీకారానికి నిదర్శనంగా ఈ ఆపరేషన్‌కి ‘సింధూర్’ అనే పేరు పెట్టారు.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…