
అందరూ ఏదైతే జరగకూడదని భావిస్తున్నారో అదే జరుగుతోంది. భారత్-పాక్ మద్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైంది.
ఆపరేషన్ సింధూర్‌కి బదులు ఇచ్చే ప్రయత్నంలో పాక్ ప్రతీకార దాడులకు పాల్పడటంతో భారత్ కూడా ఎదురుదాడులు చేస్తోంది. ఇరు దేశాల సరిహద్దు జిల్లాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి.
భారత్‌లో ప్రధానంగా పంజాబ్‌లోని కీలకమైన పటాన్‌కోట్‌లోని ఆర్మీ, వాయుసేన స్థావరాలపై పాక్ క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించగా భారత్ దళాలు వాటిని కూల్చేశాయి. ఒక పాక్ పైలట్‌ని బందీగా పట్టుకున్నారు. భారత్‌లో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలపై పాక్ దళాలు దాడులకు ప్రయత్నించింది. కానీ భారత్ ముందుగానే ఇది ఊహించి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉన్నందున పాక్ దాడులను సమర్ధంగా అడ్డుకుంది.
భారత్ నౌకా దళానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలో దిగి కరాచీ నౌకాశ్రయంపై క్షిపణులతో దాడి చేసి నౌకాశ్రయాన్ని, అక్కడ ఉన్న నౌకలను ధ్వంసం చేసినట్లు తాజా సమాచారం.
భారత్ దళాలు ఒకేసారి పాక్ రాజధాని ఇస్లామాబాద్‌తో సహా ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీ, సియాల్ కోట్, రావల్పిండిలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పై క్షిపణులతో దాడులు చేశాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్, లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థలని కూడా భారత్ దళాలు ధ్వంసం చేశాయి.
భారత్‌పై పాక్ దాడులు చేస్తున్న నేపధ్యంలో ఢిల్లీ, ముంబై, అమృత్‌సర్ తదితర ప్రధాన నగరాలలో ప్రజలను బహిరంగ ప్రదేశాలలో తిరుగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అమృత్‌సర్‌తో సహా జమ్ము కశ్మీర్ పలు ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యగా గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాకిస్థాన్‌లో కూడా ఇంచు మించు ఇదే జరుగుతోంది.
భారత్‌తో యుద్ధం చేయాలని పాక్ సైన్యాధికారులు చాలా తహతహలాడుతున్నారు కనుక ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసేలా లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని స్వాధీన పరుచుకోవాలని భారత్ నిర్ణయించుకుంది.
ఇప్పుడు ఎలాగూ యుద్ధం మొదలైంది… కనుక దానిని స్వాధీన పరుచుకునేందుకు భారత్ ఈసారి గట్టి ప్రయత్నాలే చేస్తుంది.
కానీ పాక్ దానిని ఉగ్రవాదులకు లాంచ్ ప్యాడ్‌లా ఉపయోగించుకుంటునందున, ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా కాపాడుకునేందుకు తీవ్రంగా ఎదురు దాడి చేయకుండా ఉండదు. కనుక అంతవరకు ఈ యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఈ యుద్ధం మరికొన్ని రోజులు లేదా వారాలు కొనసాగితే నిత్యావసర సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతుంది. కనుక ప్రజలు సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఉంచుకోవడం మంచిది.
దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు విశాలమైన సముద్రతీరం ఉన్నందున పాక్ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ భారత్ నావికా దళం, వాయుసేన అప్రమత్తంగా కాపు కాస్తునందున ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…