
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ ఎలాగో పాక్ పాలకులకు కశ్మీర్ అంశం అటువంటిది. తెలంగాణ రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసమే మా పోరాటాలు అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంటుంది.
అదేవిధంగా కశ్మీర్‌ని ఓ అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి, నమ్మించడంలో సఫలమైన పాక్ పాలకులు, సైన్యాధ్యక్షులు కూడా కశ్మీర్ పేరుతో రాజకీయాలు చేస్తూ ఎల్లప్పుడూ తమ చేయి పైన ఉండేలా జాగ్రత్త పడుతుంటారు.
బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడుని, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీలను తెలంగాణని దోచుకునే బూచోళ్ళుగా చూపిస్తూ సెంటిమెంట్ రగిలించి రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంటుందో, అదే విధంగా పాక్ పాలకులు కూడా ఎల్లప్పుడూ భారత్‌ని బూచిగా చూపిస్తూ ఇష్టారాజ్యం చేస్తుంటారు.
ఇటీవల ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రతినిధి మళ్ళీ కాశ్మీర్ ‘సమస్య’ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయనకు భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ చెప్పుతో కొట్టినట్లు జవాబు చెప్పారు.
ఆమె ఏమన్నారంటే, “జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. కానీ పాక్ ఆక్రమించుకున్న కశ్మీర్ పాక్‌లో అంతర్భాగం కాదు. కనుక దానిని భారత్‌కు అప్పగిస్తే మంచిది.
జమ్మూ కాశ్మీర్‌లో జరుతున్న ఎన్నికలలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవుతుంటుంది. ఈ సాక్ష్యం చాలకపోతే కశ్మీర్‌లో మా ప్రభుత్వం ప్రపంచంలోకెల్లా ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన మీ కళ్ళెదుటే ఉంది.
భారత్ ప్రభుత్వం కాశ్మీర్ అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. మీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి తెచ్చుకునే దాని కంటే ఇది చాలా ఎక్కువ. మీ అధీనంలో ఉన్న కశ్మీర్ అభివృద్ధికి మీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో చెప్పగలరా?
దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మీరు (పాకిస్తాన్) ప్రజాస్వామ్యం గురించి మాకు నీతులు చెపుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాదుల అడ్డాగా ఉపయోగించుకుంటున్న పాక్ ప్రభుత్వం, ఆ ప్రాంతాల అభివృద్ధికి చేసిందేమీ లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పాక్ ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా ముందు గోడు మొరపెట్టుకుంటారు. తమ భూభాగాన్ని భారత్‌లోని జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో విలీనం చేయాలని కోరుతుంటారు.
తమ అధీనంలో ఉన్న కాశ్మీర్‌ని పట్టించుకోని పాకిస్తాన్‌కు, అన్ని విధాల వేగంగా అభివృద్ధి చెందుతున్న కశ్మీర్‌పై కను పడటం సహజమే.
‘ఆపరేషన్ సిందూర్’లో ట్రంప్ కలుగజేసుకోకపోయుంటే నేడు పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనం అయి ఉండేదే! అప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో తప్పక విలీనం అవుతుందని కేంద్ర హోం, రక్షణ మంత్రులు బహిరంగంగానే చెప్పారు కదా? కనుక చేతిలో ఉన్న కశ్మీర్ చేజారిపోకుండా జాగ్రత్తపడితే మంచిది.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…
Mouli has become a familiar name through his social media work, web series and Little…