ఇదే సార్ మా బ్రాండూ…!

నిన్నజరిగిన బంగ్లా జట్టుతో జరిగిన మొదటి టి-20 ను భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టు లోని ఐఖ్యత, పట్టుదల మరియు ఆటగాళ్ల యొక్క గెలుపు సామర్ధ్యం నిన్న జరిగిన మ్యాచ్ లో కళ్లకుకట్టినట్లు కనపడింది. ఈ విజయం తో భారత్ సిరీస్ లో ఒకడుగు ముందుకెళ్లి, 1 -0 లో ఆధిక్యం లో ఉన్నారు.

బౌలర్లంతా కలసికట్టుగా బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయడంలో విజయం సాధించారు. 2021 తరువాత మళ్ళీ టీం ఇండియా తరుపున మైదానంలో అడుగు పెట్టారు వరుణ్ చక్రవర్తి. తన కమ్-బ్యాక్ మ్యాచ్ లో క్రికెట్ అభిమానులను బాగానే ఆకట్టుకోగలిగారు వరుణ్. ఇంకా,నిన్నే జట్టు లో డెబ్యూ ఎంట్రీ చేసిన మయాంక్ 1 వికెట్ తీసుకోగా, అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టాడు.

ADVERTISEMENT

128 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ తొలి 2 ఓవర్లలోనే 25 పరుగులు చేసాక, అభిషేక్ రన్-అవుట్ అయి వెనుదిరిగాడు. ఇక,అప్పడు క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ ‘సూర్య’ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అదే క్రమం లో కోడ్ బట్లర్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డు (4 th ప్లేస్)ను సమం చేసారు సూర్య. తొలి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు.

ఎంతో కాలం ఎదురుచూసాక వచ్చిన అవకాశాన్ని సంజు కూడా బాగానే వినియోగించుకున్నారు. ఆ పై క్రీజ్ లో కి వచ్చిన ఆల్-రౌండర్ ‘హార్దిక్ పాండ్య’ బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించారు. కేవలం 16 బంతుల్లో 39 పరుగులు చేసి మరల వింటేజ్ పాండ్య ను తలపించారు.

అలాగే మ్యాచ్ ఫినిషర్ గా పేరుందక్కించుకున్న పాండ్య సిక్స్ తో మ్యాచ్ ను ముగించి తన పేరును నిలబెట్టుకున్నాడు. అలాగే ఇంతకాలం ‘విరాట్ కోహ్లీ’ పేరిట ఉన్న ఈ రికార్డు ను బద్దలుకొట్టారు. మ్యాచ్ ను సిక్సర్ తో ముగించిన ఆటగాడిగా ‘విరాట్’ 4 సార్లు ఈ ఫీట్ అందుకుంటే, నిన్న పాండ్య ఆ రికార్డు ను దాటి 5 సార్లు సిక్సర్ తో మ్యాచ్ ను ముగించారు.

అయితే 128 లక్ష్యాన్ని కేవలం 11 .5 ఓవర్లలో ముగించి, 120 + స్కోరును అత్యంత వేగంగా ఛేదించి రికార్డు సృష్టించారు. తొలి టి-20 లో భారత బౌలర్లు బంగ్లా బ్యాటర్లను కేవలం 127 పరుగులకు ఆల్-అవుట్ చేసి ప్రత్యర్థి టీం ల ను అత్యధిక సార్లు ఆల్-అవుట్ చేసిన జట్టు గా భారత్ ఇప్పుడు పాకిస్తాన్ తో సమంగా 42 సార్లు ప్రత్యర్థులను ఆల్-అవుట్ చేసారు.

ఇలా,తమదైన ఆటతీరు తో పాత రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను సృష్టిస్తూ ఆడుతున్న ఈ కుర్ర భారత జట్టు ప్రదర్శన చూసి తమ క్రికెట్ అభిమానులు సొంత జట్టు పై అభిమానంతో “ఇదే సార్ మా బ్రాండూ” అని నెట్టింట హడావుడి చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

1 hour ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

2 hours ago