
ఐసీసీ 2024 టి-20 ప్రపంచకప్ ముగిసిన పిమ్మట ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూసిన టోర్నీ ‘ఛాంపియన్స్ ట్రోఫీ’. ఎట్టకేలకు ఆ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మొదలయ్యింది.
ఇప్పటికే, ప్రతి జట్టు తమ మొదటి లీగ్ మ్యాచ్ ను కూడా ఆడారు. అయితే, అందరు అనుకున్నట్టే బంగ్లా పోరు లో భారత్ గెలిచి ఈ టోర్నీ లో బోణి కొట్టారు. మరోవైపు ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు ఆతిధ్యం వహిస్తున్న పాక్ మొదట న్యూజిలాండ్ తో తలపడగా, అందులో ఓటమి చెందారు.
ఛాంపియన్స్ ట్రోఫీ లో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం అని చెప్పవచ్చు. మొదటి మ్యాచ్ ను గెలిచిన భారత్ కాస్త ఒత్తిడి లేకుండా మిగిలిన మ్యాచ్ లను ఆడగలగాలి, అయితే పాక్ మాత్రం తన మొదటి మ్యాచ్ చేజార్చుకోవడంతో ఇక మిగిలిన మ్యాచ్ లను గెలుపే లక్ష్యం గా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ క్రికెట్ పోరులో ఎవరు ఎవరితో తడపడినా ఏ మ్యాచ్ ఇవ్వలేని కిక్ ఇండియా, పాక్ మ్యాచ్ తో ప్రపంచ క్రికెట్ అభిమానులు పొందుతారు. ఈ టోర్నీలో కూడా రేపు ఆ కిక్ ఇవ్వడానికి దుబాయ్ వేదికయ్యింది. రేపు 2.30 నిముషాలకు దుబాయి వేదికగా ఈ దాయాదుల పోరుకి రంగం సిద్దమయ్యింది.
దీనితో ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ అంతా కూడా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే 2017 లో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ఇదే ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ లో తలపడగా, భారత్ ను చిత్తు గా ఓడించారు పాక్ జట్టు.
ఐసీసీ ఈవెంట్ ల లో పాక్ పై భారత్ కు మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ, ఈ దుబాయ్ గ్రౌండ్ లో ఇప్పటికే ఒకసారి తలపడ్డారు ఈ దాయాది జట్లు. 2021 లో జరిగిన టి-20 వరల్డ్ కప్ లో భారత్ పై ఏకంగా 10 వికెట్లతో గెలిచింది పాక్ జట్టు. అదే ధీమా తో ఈసారి కూడా భారత్ ను ఓడించటం తప్పనిసరి అంటున్నారు పాక్ అభిమానులు, ఆ జట్టు మద్దతుదారులు.
ఈ 2025 టోర్నీ ప్రకారం చూస్కుంటే, పాక్ జట్టు సెమీస్ కు చేరాలంటే మిగిలున్న రెండు మ్యాచ్లు తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ పాక్ జట్టుకి భారత్ చేతిలో పరాభవం ఎదురయితే ఇక ఈ ఛాపింయన్స్ ట్రోఫీ నుండి పాక్ పక్కకు తప్పుకున్నట్టే. మరోపక్క, తొలి మ్యాచ్ తో నే బోణి కొట్టిన భారత్, ఈ మ్యాచ్ లో కూడా గెలిచి తమ సెమీస్ చోటు ని పదిలం చేసుకునే వ్యూహాలతో బరిలోకి దిగనున్నారు.
అయితే, ఈ మ్యాచ్ కు టాస్ కూడా కీలకం కానుంది. చూడాలి మరి, పాక్ పై తమకున్న ఐసీసీ రికార్డు ను భారత్ మరింత పదిలం చేసుకుంటుందా అని..!! ఈ రసవత్తరమైన పోరులో భారత్ పై పైచెయ్యి సాధించడానికి మాజీ ప్లేయర్ ముదస్సర్ నాజర్ ను తమ జట్టుకి స్పెషల్ కౌచ్ గా నియమించింది. అయితే భారత్ అభిమానులు మాత్రం 2017 ఓటమికి 2025 లో టీం ఇండియా పాక్ కు ఖచ్చితంగా బదులు చెపుతుంది అనే ధీమాలో ఉన్నారు.
Nana Patekar’s sudden demise on October 8, 2026, led to several tributes on social media.…
Nitesh Tiwari’s Ramayana is only a few weeks away from release. While the promotional strategy…