Telugu

అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత భారత్‌

కుర్రాళ్లు అదరగొట్టేసారు. నాలుగోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలిచి పృథ్వీషా సేన రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో ఈ టోర్నమెంట్ లో ఓటమి అంటూ లేని జట్టుగా భారత్ అవతరించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 47.2 ఓవర్లలో ఆలౌట్‌ అయి 216 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత కుర్రాళ్లు మొదటి నుండి నిలకడగా ఆడుతూ కేవలం 38.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 220 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. మన్‌జోత్‌ కల్రా అద్భుతమైన శతకంతో భారత్‌కు విజయాన్ని అందించాడు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వచ్చిన దగ్గనుండి భారత్ కుర్రాళ్లు అదరగొట్టేస్తున్నారు.

ADVERTISEMENT

ఇది సమిష్టి విజయం…కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు అని ద్రావిడ్ కితాబిచ్చారు. కప్ గెలిచిన అనంతరం బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ కు 50 లక్షలు, ఆటగాళ్లకు ఇతర సపోర్ట్ స్టాఫ్ కు చెరి 20 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. భారత్ కు రాగానే ఘన స్వాగత సత్కారాలను ఏర్పాటు చేయబోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

OG 2: What Sujeeth Planned for Pawan Fans

Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…

30 minutes ago

Prabhas’ Busy Calendar Becomes A Headache For Kalki 2

Prabhas has reached a point where the problem is no longer finding big films. It…

59 minutes ago