
2013 ఇండియా vs బంగ్లా సిరీస్ డిసైడర్ లో భారత్ మ్యాచ్ ను గెలుచుకున్న వెంటనే, కామెంటరీ లో ఉన్న భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇలా అన్నారు ‘మనం ఇప్పుడు భారత భవిష్యత్ ను చూస్తున్నాము’ అని. ఆ మాటలు నేటి భారత సారధి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ను ఉద్దేశించి అన్న మాటలే.
ఆ భారత దిగ్గజం వ్యాఖ్యానించినట్టే అప్పటినుండి భారత క్రికెట్ జట్టు కు రెండు అత్యంత దృఢమైన స్తంభాలుగా తయారయ్యారు రోహిత్-విరాట్ ల కాంభినేషన్. ఎన్నో మ్యాచ్ లను , సిరీస్ లను భారత్ కు అందించి, కెప్టెన్ గా ఇరు ప్లేయర్సు భారత క్రికెట్ కు ఎన్నో మధురానుభూతులను మిగిల్చారు. టెస్ట్ క్రికెట్ కు మరల ప్రాణం పోసింది విరాట్ అవ్వగా, మరల భారత్ కు 13 ఏళ్ళ తరువాత ఒక ఐసీసీ కప్ తెచ్చిన సారధి రోహిత్ శర్మ.
2023 ప్రపంచకప్ టోర్నీ లో ఈ ఇద్దర్ని అభినందించని క్రికెట్ అభిమాని ఉండడని అనటంలో సంకోచమేలేదు. ఆ రేంజ్ ఆటను కనబరిచారు ఇరువురు. అందుకు తోడుగా 2024లో కూడా మొదటి సగం ఇద్దరికీ చాలా గుర్తుండిపోతుంది. 13 ఏళ్ళ ఐసీసీ ట్రోఫీ ద్రాహాన్ని తీర్చుకున్నారు రోహిత్ కెప్టెన్సీ లో.
అయితే అసలు కథ ఇప్పుడే మొదలయింది. ఇంకా ఆ కప్ ను గెలిచి కనీసం 6 నెలలు కాలేదు. కప్ గెలిచినప్పుడు భుజం మీద వేసుకున్న అదే జనం నేడు ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
గత కొంత కాలంగా చూస్తే, రోహిత్ మరియు కోహ్లీ టెస్ట్ ఫార్మటులో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కోహ్లీ అడపాదడపా ప్రదర్శించినప్పటికీ, అతని స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ను ఆడి చాలా కాలమే గడిచింది. అతి కీలకంగా, ఇంచుమించు ప్రతి ఇన్నింగ్స్ లో కూడా ఒకే రకమైన బాల్ కు తన వికెట్ ను సమర్పించుకుంటున్నారు విరాట్.
అయితే భారత జట్టు కెప్టెన్ గా ప్రస్తుతం రోహిత్ టెస్ట్ ఫామ్ అత్యంత దారుణంగా ఉంది. బ్యాటింగ్ ఫామ్ ఒక్కటే కాక, ఏకంగా 13 ఏళ్ళ తరువాత ఇంట ఒక టెస్ట్ సిరీస్ ను ఓడారు తన కెప్టెన్సీ లో, పైగా భారత చరిత్ర లో నే లేనట్టుగా వైట్ వాష్ అయ్యారు. 144 ఏళ్ళ టెస్ట్ చరిత్ర లో న్యూజిలాండ్ జట్టు భారత్ పై భారత్ లో ఒక్క సిరీస్ కూడా గెలవలేదు, అయితే ఇప్పడు ఏకంగా వైట్ వాష్ చేసారు.
ఈ దారుణాలన్నీ రోహిత్ కెప్టెన్సీ లో నే వచ్చిన యెడల, రోహిత్ ను కెప్టెన్ గా వైదొలగించి, ఆ స్థానాన్ని జస్ప్రీత్ బుమ్రా కు అప్పజెప్పాలని సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు రోజంతా క్రీజ్ లో పాతూపోయిన విరాట్ నేడు గట్టిగా 20 బాల్స్ ఆడటానికి కూడా కష్టపడుతున్నాడు, ఇవన్నీ చూస్తుంటే ‘వారి అధ్యాయానికి ముగింపు దగ్గర్లోనే’ ఉన్నట్లు అనిపిస్తోంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…