Telugu

ఇదేం లాజిక్ ‘సెన్సిబుల్’ డైరెక్టర్ గారు?

దర్శకుడిగా “గ్రహణం” సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన ఇంద్రగంటి మోహన కృష్ణ కు ఇప్పుడు గ్రహణం పట్టినట్టు ఉంది. అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, మిథునం వంటి సినిమాలతో ఒక సెన్సబుల్ దర్శకుడిగా పేరు సంపాదించికున్న ఇంద్రగంటికి పరాజయాలు ఒకదాని వెనుక ఒకటి పలకరించడంలో ఫ్రస్టేషన్ కు లోనయినట్టున్నారు.

ఒక ఇంటర్ వ్యూ లో పాల్గొన్న ఇంద్రగంటి సినీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.తెలుగు వాళ్ళు మలయాళం, తమిళ వాళ్ల కంటే ఎక్కువ స్ట్రెస్ అనుభవించడం లేదు కదా? వాళ్లు చూస్తున్నారు కదా సినిమాలు, అన్ని కష్టాలు మరిచిపోవాలని ప్రేక్షకులు సినిమా ధియేటర్ కు రాకూడదు అలా వచ్చిన వారిని తృప్తి పరిచి ధియేటర్ నుండి బయటకు పంపడం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు ఇంద్రగంటి.

ADVERTISEMENT

ఎంటర్ టైన్ మెంట్ కావలి అంటే సినిమా కు వెళ్ళకూడదు, ఏదైనా పబ్ కి వెళ్ళి మందుకొడితే సరిపోతుందిగా అంటూ యువతకు ఒక ఉచిత సలహా పడేసారు. సినీ ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేయాలో తెలియక తీసిన సినిమాలన్నీ వరుస పరాజయాలు సాధించడంతో ప్రేక్షకుడి మీద తన ఆక్రోశాన్ని,తన ఫ్రస్టేషన్ ను ఇలా తెలియచేసారు ఇంద్రగంటి అంటూ విమర్శలు మొదలయ్యాయి.

MAD , బలగం, పొలిమేర, సామజవరాగమనా, బేబీ…వంటి చిన్న సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అనూహ్య విజయం అందుకున్న కొత్త దర్శకులు, నటీనటులు ఎందరో తమ టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాలను, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లకొట్టిన ఉదంతాలు ఇంద్రగంటి చూడలేకపోతున్నారా…?ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకుంటే ప్రేక్షకుల మీద ఇటువంటి చోకబారు విమర్శలకు అవకాశం ఉండేదేనా..?ఒక్కసారి ఇంద్రగంటి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

జెంటిల్ మెన్ గా ఉండే ఇంద్రగంటి సినీ ప్రేక్షకుడిని తన సినిమాలతో సమ్మోహన పరచలేక అమితుమీ తేల్చుకోవాలని సిద్దపడ్డారేమో అనిపిస్తుంది. అందుకే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని భావించి అది కుదరక పోవడంతో ఆయన ఆవేదనను చెప్పాలనుకున్నారో ఏమో కానీ పబ్ లు, మందు అంటూ మాట్లాడి రాంగోపాల్ వర్మను గుర్తుచేశారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. హిట్స్ కి ముందు… హిట్స్ కి తరువాత ఇంద్రగంటి అంటూ ఆయన మాటలను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

NTR Back To Work, But Neel Must Manage Well

Junior NTR's upcoming film Dragon, directed by Prashanth Neel, has faced several production delays since…

30 minutes ago

స్థానిక పండుగకు కొత్త బట్టలు అవసరమే కానీ…

ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నేతలు, ధనవంతులు, ప్రముఖులు ఏదో ఓ పార్టీలలో చేరడం సర్వసాధారణం. టీడీపీ ఇప్పటికే హౌస్…

33 minutes ago