
Jana Sena New Joinings: Pawan Kalyan Faces Grassroots Leadership Challenge
ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నేతలు, ధనవంతులు, ప్రముఖులు ఏదో ఓ పార్టీలలో చేరడం సర్వసాధారణం. టీడీపీ ఇప్పటికే హౌస్ ఫుల్. పదవుల కోసం చాలా మంది క్యూ లైన్లో ఉన్నారు. కనుక ఇలాంటి సమయంలో చేరినా ఏదో అలా పక్క వాయిద్యం వాయించుకుంటూ కాలక్షేపం చేయాలే తప్ప పదవులు దక్కే అవకాశం ఉండదు.
బీజేపీలో చేరవచ్చు. కానీ ఈ ఎన్నికల బరిలో దిగి బోలెడు డబ్బు ఖర్చు చేసినా ఆ తర్వాత పెద్దగా గుర్తింపు ఉండకపోవచ్చు.
కనుక హాట్ కేకులా కనిపిస్తున్న జనసేనలోకి కొందరు ప్రముఖులు క్యూ కడుతున్నారు. వారందరికీ జనసేనాని చకచకా కండువాలు కప్పేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
తాజాగా వంగవీటి రాధాకృష్ణ మొదలు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డోలా జగన్, యనమల కృష్ణుడు, నవీన్ నిశ్చల్, ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు జనసేనలో చేరుతున్నారు. పార్టీని, దాని నాయకుడిని నమ్మి ఇంత మంది ప్రముఖులు చేరుతున్నారంటే ఇది చాలా శుభపరిణామమే.
అయితే పండుగ ముందు కొత్త బట్టలు కుట్టించుకున్నట్లు వంటి ఈ చేరికలతో చాలా సంతోషం కలుగుతుంది. కానీ బీరువాలో కనీసం ఓ డజనో రెండు డజన్లో ఇస్త్రీ చేసిన బట్టలు ఉంటే ఆ ధైర్యం, నమ్మకం వేరే స్థాయిలో ఉంటుంది. కనుక జనసేన కూడా అలాంటి నమ్మకమైన బట్టల వంటి బలమైన ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను తయారు చేసుకోవడం చాలా అవసరం.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం వంటి పార్టీలు అలాగే నాయకులను తయారు చేసుకున్నాయి కనుకనే దశాబ్దాల పాటు మడత నలగకుండా రాజకీయాలలో నిలదొక్కుకోగలుగుతున్నాయి కదా?
The Telugu box office welcomed Rajinikanth's Jailer 2 on October 15, with the film receiving…
తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతుంది? ఆంధ్రా పాలకుల దోపిడీ పోతుంది. నీళ్ళు, నిధులు, నియమాకాలు జరుగుతాయి. ఇది సినిమాలలో హీరోలు…