ఐ ప్యాక్ నటన..! ఎవర్రా మీరంతా..?

ipac-girl

వైసీపీ రాజకీయాలలోకి వచ్చిన తరువాత ప్రజలను నమ్మి, రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన రాజకీయాలను ఐ ప్యాక్ సర్వేల ఆధారంగా నడపడం చూస్తే వైసీపీ ఒక రాజకీయ పార్టీనా లేక ఒక కార్పొరేట్ సంస్థా అనే అనుమానాలు కలుగక మానవు.

ADVERTISEMENT

కనికట్టు మాయాజాలంతో ప్రజలను మభ్య పెట్టే మంత్రగాళ్ళ మాదిరి తయారయ్యారు వైసీపీ నాయకులు. సినిమాలో స్క్రిప్ట్ రాసుకుని షూటింగ్ మొదలుపెట్టిన మాదిరి ముందుగానే కొంతమంది ఐ పాక్ సిబ్బందిని ఏర్పాటు చేసి వారి చేత జగన్ గురించి హీరో తరహా ఎలివేషన్ ఇప్పించి ప్రజల దృష్టిని వైసీపీ పార్టీ వైపుకి మరల్చడమే ఈ ఐ ప్యాక్ కర్తవ్యం.

అయితే 2019 ఎన్నికలలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వైసీపీ కి సేవలందించిన ఈ ఐ ప్యాక్ సంస్థ ఇప్పుడు పీకే కు తప్పించి అతని టీం తో పని చేయించుకుంటుంది. గతంలో కూడా వైసీపీ తరుపున జగన్ కు మద్దతుగా ఈ ఐ ప్యాక్ సంస్థ అనేక కనికట్టు విద్యలు ప్రదర్శించింది. ప్రత్యేక హోదా విషయంలో విద్యార్థులను ప్రభావితం చేయడానికి ఒక కళాశాలలో మీటింగ్ పెట్టిన వైసీపీని అక్కడి విద్యార్థి లేచి జగన్ కు కేజియాఫ్ మాదిరి ఎలివేషన్ ఇచ్చింది.

దీనితో అక్కడున్న వారే కాకుండా టీవీలు వీక్షిస్తున్న వారు కూడా జగన్ గొప్పతనం మనం అర్ధం చేసుకోలేక పోతున్నామా అనే లెవెల్ లో ఆస్కార్ నటన ప్రదర్శించింది సదరు విద్యార్థిని. తీరా ఎన్నికల తంతు పూర్తయిన తరువాత చూస్తే అదంతా ఐ ప్యాక్ స్క్రిప్టులో భాగమని తేలిపోయింది. ఇలాంటి స్క్రిప్టెడ్ దృశ్యాలు మరెన్నో 2019 ఎన్నికలలో జగన్ ను గెలిపించడానికి ఐ ప్యాక్ టీం సిద్ధం చేసింది. అనుకున్నట్టే ప్రజలను మభ్యపెట్టగలిగింది కూడా.

అయితే గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఐ ప్యాక్ చేస్తున్న ప్రతి అంశాన్ని ముందుగానే పసిగడుతున్నాయి ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా విభాగం. ఇందులో భాగంగానే ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం పని చేసిన ఐ ప్యాక్ సిబ్బందిని అభినందించడానికి వారి కార్యలయానికి విచ్చేసారు. పార్టీ కోసం పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారితో సెల్ఫీలు తీసుకున్నారు జగన్.

అయితే అందులో ఒక సెల్ఫ్ వైసీపీ ఐ ప్యాక్ మాయను బయటపెట్టింది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో ఒక మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నలకు తడబడకుండా అన్నింటికి జగనన్నే కారణమంటూ జగన్ భజన చేసింది ఒక యువతి. జగన్ పాలన చాల బాగుంది, నాకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది, దానిని జగన్ మామా గెలుపు కోసమే వాడుకుంటాను, ఈ కట్టే కాలే వరకు నా ఓటు జగన్ కే, పవన్ లాంటి హీరోలు వస్తుంటారు, పోతుంటారు. జగన్ లోకల్ అంటూ సినిమా స్టైల్ లో అర్ద రూపాయికి పది రూపాయలు యాక్టింగ్ చేసి సోషల్ మీడియా దృష్టిలో పడింది ఆ యువతి.

అయితే ఇప్పుడు పోలింగ్ జరిగిన మూడు రోజుల తరువాత అదే యువతి జగన్ తో సెల్ఫ్ దిగుతూ ఐ ప్యాక్ టీంలో దర్శనమిచ్చింది. దీనితో ఇది కూడా ఐ ప్యాక్ టీం సృష్టేనా, ఎవర్రా మీరంతా అంటూ నోరెళ్లపెడుతున్నారు నెటిజన్లు. నీ ‘ఐ ప్యాక్ నటనకు’ శతకోటి నమస్కారాలు తల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories