ముంబై గెలుపుకు ‘న్యూడ్’ డ్యాన్స్!

ipl 10 Jos Buttler Mumbai indiansఖచ్చితంగా ఓడిపోతుంది అని భావించిన మ్యాచ్ లో… విజయం వరిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు మరియు ఆ జట్టు అభిమానులు అదే కిక్ ను అనుభవిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 10 ఫైనల్లో పూణే చేతిలో మరోసారి ఓటమి ఖాయం అని భావించిన నేపధ్యంలో… అనూహ్యంగా విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలకు అల్లంత దూరాన ఇంగ్లాండ్ లో ఉన్న ముంబై ఇండియన్ జట్టు సభ్యుడు జాస్ బట్లర్ కూడా, ఈ విక్టరీని ఎవరూ చేసుకోలేని సెలబ్రేట్ చేసుకున్నాడు.

అంతకుముందు వరల్డ్ కప్ గెలిస్తే… తాను న్యూడ్ షో ఇస్తానని చెప్పిన పూనం పాండే వ్యాఖ్యలు ఎంతమేరకు వాస్తవరూపం దాల్చాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే పూనం మాదిరి కాకుండా, మ్యాచ్ చివరి బంతి వేసే సమయానికే బట్లర్ పూర్తిగా న్యూడ్ గా మారిపోయి, టీవీ ముందు చిందులు వేసాడు. చివరి బంతి జాన్సన్ వేయగానే టవల్ కట్టుకుని పైకి లేచిన బట్లర్, ఆ తర్వాత సుందర్ రనౌట్ కాగానే, ఆ టవల్ ను తీసేసి స్టెప్పులు వేసాడు. అంచనా వేయని ముంబై జట్టు విజయాన్ని బట్లర్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు.

ADVERTISEMENT

అయితే ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి చేతిలో రెండు షాంపైన్ బాటిల్స్ పట్టుకుని కూడా ఫోజు ఇచ్చాడులేండి! బట్లర్ చేసిన ఈ విన్యాసానికి ‘బోల్డ్ బ్యూటీ’ పూనం పాండే అభినందించింది. తొలి 10 మ్యాచ్ ల వరకు పాల్గొన్న జాస్ బట్లర్, ఓపెనర్ గా విజయవంతమైన బాధ్యతలను నిర్వహించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే పిలుపు రావడంతో ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన బట్లర్, అక్కడ నుండే మ్యాచ్ ను తిలకించి సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories