ముంబై… కోల్ కతా… దొందు దొందే..!

ipl-2017-Mumbai-Indians-vs-Knight-Ridersఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 లో చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు రెండవ సెమీ ఫైనల్ జరగబోతోంది. ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్న రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తో తలపడే జట్టు ఏదా అన్న ఆసక్తిలో క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఫైనల్ కు చేరుకోవడం కోసం బెంగుళూరు వేదికగా ముంబై ఇండియన్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లలో ఈ రెండు జట్లు తలపడగా, రెండు సార్లు ముంబై జయకేతనం ఎగురవేసింది.

అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో దారుణమైన ప్రదర్శనను కనపరిచిన ముంబైపై ఒత్తిడి ఎక్కువగా ఉండగా, సన్ రైజర్స్ ను మట్టికరిపించిన ఉత్సాహంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఉంది. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే… పేపర్ పై రెండు జట్లు బలంగానే కనపడుతున్నాయి. అయితే అవసరమైన సమయంలో రాణించే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరు జట్లు ఎంత బలంగా ఉన్నాయో, ఒత్తిడిని అధిగమించడంలో రెండు జట్లు కూడా అంత వీక్ గానే ఉంటాయి. దీంతో క్వాలిఫైయర్ 2లో సరైన జట్లే పోటీపడుతున్నాయి.

ADVERTISEMENT

ఈ ఏడాది బెంగుళూరు పిచ్ పై భారీ స్కోర్లు నమోదు కావడం కష్ట సాధ్యంగా మారిన తరుణంలో, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 160 నుండి 170 పరుగులు నమోదు చేస్తే విజయావకాశాలు తమ వైపుకు తిప్పుకున్నట్లే భావించవచ్చు. అయితే రెండు జట్లకు ఈ సీజన్లో భారీ చేజింగ్ లు చేసిన ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో టాస్ గెలిచిన ఏ జట్టైనా తొలుత బౌలింగ్ చేసే అవకాశాలే కనపడుతున్నాయి. ఇక గత మ్యాచ్ లో వరుణుడు కూడా ప్రత్యక్షం కావడంతో, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే లక్ష్య చేధనలో ఉన్న జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories