
గత కొన్ని సంవత్సరాలుగా, ఐపీఏల్ ను కేవలం ఒక వినోదాన్ని అందించే లీగ్ గా నే కాక, మన భారత క్రికెట్ టీం కు యువ టాలెంట్ ను అందచెయ్యటం లో ఐపీల్ ఎంతో భరోసా ను కలిపించింది. దేశ వాళి క్రికెట్ లో బాగా రాణించి ఐపీల్ లో తమ సత్తా నిరూపించుకుని ఇండియన్ టీం కు ఎంతో మంది ఎంపికయ్యారు.
ఒకప్పుడు దేశ వాళి మ్యాచ్ ల లో మెరుగ్గా ప్రదర్శించి, సెలెక్టర్ల దృష్టి వారి పై పడేలా ఆడి జాతీయ జట్టుకు చేరుకునేవారు. కానీ ఏ ముహూర్తాన ఈ ఐపీఏల్ మొదలయ్యిందో, సెలెక్టర్లకు సగం పని తగ్గినట్లే భావించవచ్చు. ప్రతి ఏడు ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆక్షన్ నిర్వహించగా, అన్ని ఫ్రాంచైజీలు దేశ వాళి టోర్నమెంట్ ల లో బాగా ప్రదర్శించిన వారిని కొనుగోలు చేసి, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి కేవలం ఆ ఫ్రాంచైజ్ లాభానికే కాక ఇండియన్ టీం కు సెలెక్ట్ అవ్వటం లో ఎంతో తోడ్పడుతున్నాయి.
ఇప్పటికే ముంబై ఇండియన్స్,రాజస్థాన్ రాయల్స్,చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టులు ఇలా ఎందరో యువకులలోని విశిష్టతను గుర్తించి, వారిని బాగా చెక్కిన శిల్పం ల మలిచి, వారి కెరీర్ కు ఎంతో భరోసానిచ్చాయి. కాగా, ఈ సంవత్సరం ఐపీఎల్ కు ఇప్పటికే చాలా మంది యువ సామర్ధ్యం వెలుగులోకి వచ్చింది. లక్నో టీం నుండి ‘మయాంక్ యాదవ్’ ఒక మెరుగైన ఫాస్ట్ బౌలర్ గా, బంతులను అలవోకగా 150 + స్పీడ్ తో మంచి లైన్ అండ్ లెంగ్త్ వేస్తూ, అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అయితే గాయం కారణంగా ప్రస్తుతం ఆయన మ్యాచ్ ల కు అందుబాటు లో లేరు.
అలాగే అభిషేక్ శర్మ రూపం లో ఒక దూకుడైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ బయటకు వచ్చారు. ఇక అలాగే తాజాగా, ఇటీవలే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు అశుతోష్ శర్మ, ఈ ఐపీఎల్ కె హైలైట్ గా మారుతున్నారు. పంజాబ్ కింగ్స్ వరుస ఓటములను మూటగట్టుకున్నప్పటికీ అశుతోష్ మరియు శశాంక్ ల జోడి ఈ ఐపీఎల్ కే అత్యంత డేంజరస్ జోడి గ మారింది.
వీరు ఇప్పటికే ఆడిన అన్ని టీమ్స్ కు ఎక్కడ వెన్ను చూపకుండా, కచ్చితంగా ఓడిపోతుంది అనే మ్యాచ్ ల ను సైతం లాస్ట్ ఓవర్ వరుకు పోరాడి క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఈ నేపధ్యం లో అశుతోష్ శర్మ ఇండియన్ టీం పిలుపు కు ఎంతో దూరం లో లేనట్లు తెలుస్తుంది. ఇప్పటికే 2023 లో యశస్వి జైస్వాల్ యువ టాలెంట్ ను భారత టీం కు అందించింది ఐపీఎల్. 2022 ఐపీఎల్ ద్వారా శుబ్మాన్ గిల్ వంటి అరుదైన సామర్ధ్యం గల బాట్స్మన్ అందారు. 2021 లో రుతురాజ్, ఇలా ఎందరో ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా తమ సత్తాను చాటుకుని భారత జట్టు లో నికి అరంగేట్రం చేసారు, చేస్తున్నారు.
ఇక ఒకానొక సమయంలో, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాడు సైతం ఈ ఐపీఎల్ వలనే ఇండియన్ టీం కు చేరగలిగారు. దేశ వాళిక్రికెట్ లో ఎంత బాగా ఆడినప్పటికీ, ఆయన ఇండియన్ టీం కు ఆడాలి అనే కల నెరవేరలేదు. ఐపీఎల్ లో ముంబై తరుపున రెండు మూడు సీజన్లు నిలకడగా ఆడటంతో భారత జట్టుకు అరంగేట్రం చేసారు సూర్య. ఇలాగే ఐపీఎల్ మన జాతీయ జట్టుకు అన్ని విధాలా ఉపయోగ పడాలి అని భారత క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
Ever since the official announcement of Indian 3 dropped, social media has been flooded with…
Priyadarshan had a record of directing remakes for the majority of his career. He even…