
ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులను ఎదురుచూసిన ఐపీఎల్ 2025 ఆక్షన్ రేటెన్షన్ రూల్స్ ఐపీఎల్ యాజమాన్య మండలి మరియు బీసీసీఐ సెక్రటరీ జయ్ షా విడుదల చేసారు. అయితే మొత్తం 6 పాయింట్ల గా ఈ నియమానాలను రూపొందించారు.
అందులో మొదటి రూల్ గా; ఒక్కో ఫ్రాంచైజ్ ఎన్నేసి ఆటగాళ్లను రెటైన్ చేసుకోవాలి అనేది వెల్లడించారు. అయితే ఇందులో మొత్తం 6 ఆటగాళ్లను టీం లో రెటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇది నేరుగా 6 రెటైన్, లేదా 5 రెటైన్+1 ఆర్.టీ.ఎం, 4 + 2 ఆర్.టీ.ఎం, ౩+౩ ఆర్.టీ.ఎం, 2 + 4 ఆర్.టీ.ఎం,1 + 5 ఆర్.టీ.ఎం, లేదా ఆరుగురిని ఆక్షన్లోనే ఆర్.టీ.ఎం ద్వారానే టీం లోనికి తెచ్చుకోవచ్చు.
అయితే ఈసారి, రెటైన్ చేసుకునే వారిలో ఫారెన్ లేదా ఇండియన్ కు కౌంట్ లేదు. ఏ టీం ఎంతమంది ఫారెనర్స్ నైనా రెటైన్ చేస్కోవచ్చు. కానీ,ఇందులో చిక్కు ఏంటంటే, ఆ ఆరుగురిలో ఒక్క భారత అన్-క్యాప్డ్ ప్లేయర్ తప్పనిసరిగా ఉండాలి. అనగా,ఒక జట్టు ఏకంగా 5 ఫారెనర్లను రెటైన్ చేస్కునే అవకాశం ఉంది. ఈ రూల్ ‘ఎస్.ఆర్.హెచ్’ జట్టుకు చాల ఉపయోగపడుతుంది.
మూడో రూల్ గా, ఒక్కో జట్టు పర్స్ వాల్యూ గా 120 కోట్లు కేటాయించారు. ఒకవేళ ఏదైనా జట్టు వారి టీం లో 6 గురిని రెటైన్ చేస్కునేలెక్కైతే, ఏకంగా 79 కోట్లు ఖర్చుపెట్టాల్సొస్తుంది. అప్పుడు కేవలం 41 కోట్లు పర్స్ తో ఆక్షన్ లో కి వస్తుంది ఆ జట్టు. దాని వల్ల ప్రతి టీం కేవలం ముగ్గురినే రెటైన్ చేస్కుని, ఎక్కువ మందిని ఆక్షన్ లో కి వదిలేస్తారు. పేరుకు ఆరుగురిని రెటైన్ చేస్కోవచ్చు అని చెప్పి, రెటైన్ స్లాబ్ సృక్చర్ నే మార్చేసాడు జయ్ షా!
ఈ మూడో రూల్ వల్ల ‘ముంబై’ జట్టు చాల లాభపడవచ్చు. నాలుగో రూల్ గా ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ఫీ ను అమలుచేశారు. ప్రతిసారి, సీజన్ మొత్తం ఆడినందకు ఆటగాడికి ఆక్షన్ లో పలికే ధర మాత్రమే చెల్లించే ఫ్రాంచైజ్, ఈసారి మ్యాచ్ ఫీ రూపంగా అదనంగా మరొక 7 .5 లక్షలను వెచ్చించాలి. ఎన్ని మ్యాచ్లు ఆడితే అన్ని ఏడున్నర లక్షలు, అది కాకుండా ఆక్షన్ లో పలికే ధర. ఇలా ప్రతి జట్టులో 25 మంది ఉండగా, ప్రతి ఆటగాడికి సీజన్ కి అదనంగా కోటి చప్పున 25 కోట్లు అదనంగా చెల్లించాలి.
ఇక ఐదో రూల్, ప్రతీ ఫారెన్ ఆటగాడికి ఒక అలారం లాగా డేంజర్ బెల్ ను తలపిస్తోంది.గత కొన్ని సీజన్లుగా, ఎందరో ఫారెన్ ప్లేయర్స్ ఆక్షన్ కు తమ పేరిచ్చి, వారిని ఏదొక జట్టు కొనుగోలు చేసాక, ఏవేవో సాకులు చెప్పి సీజన్ నుండి బయటకు వెళ్లిపోతున్నారు. వారు ఆశించిన ధర వారికి దక్కకపోతే ఇలాంటి పనులు చేస్తారు. వాటికి చెక్ పెడుతూ ఈ ఏడాది అలా చేసినచో, వచ్చే రెండేళ్లు వారు ఐపీఎల్ నుండి బ్యాన్ అవుతారని చెప్తుంది ఈ రూల్.
ఇక చివరిగా, గతేడాది మొదలయిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనే తరహా క్రికెట్ ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా ఉండబోతుందని, వచ్చే రెండేళ్లలో కూడా ఉంటుందని స్పష్టం చేసింది ఐపీఎల్ యాజమాన్యం. అలాగే, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 5 ఏళ్ళు గడిస్తే, వారిని ‘అన్-క్యాప్డ్ ప్లేయర్’ గా పరిగణించవచ్చని ఉత్తర్వులు జారీ చేసారు. ఇలా చూస్తే “ఎం.ఎస్.ధోని” మరోసారి ఐపీఎల్ లో మెరిసే అవకాశాలున్నాయి. ఇలా చాల షరతులతో ఉన్న ఈ లిస్ట్ అందరిని ఆకట్టుకుంది.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…