
ఐపీఎల్ లీగ్ స్టేజి దాదాపు చివరి దశకు వచ్చేస్తూ ఉంది. పాయింట్ల పట్టిక లో ఆ టాప్ 2 స్పాట్లను ఎవరు కైవసం చేసుకోగలరు..? ఆ పట్టిక లో టాప్ 4 లో ఏ జట్లు ఉండగలిగే అవకాశాలున్నాయి..?
ఏ జట్లు ఇప్పటికే తమ ప్లే-ఆఫ్ అవకాశాలను చేజార్చుకున్నాయి..? అనేటటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతున్నాయి. కానీ, ఈసారి ఆరెంజ్ క్యాప్ ను ఎవరు అందుకోనున్నారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇప్పట్లో ఎవరు చెప్పేలాగా లేరు.
ఎందుకంటే, ఈ ఆరెంజ్ క్యాప్ కోసం ఆటగాళ్ల మధ్య అంత దారుణమైన పోటీ నడుస్తుంది. ఐపీఎల్ సీజన్ మొదలయినప్పటి నుండి ఆ సీజన్ ముగిసేలోపు, ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారో, వారికి ఈ ఆరెంజ్ క్యాప్ ను అందజేస్తారు. గత కొన్ని ఏళ్లగా కూడా, మనం ఈ క్యాప్ కోసం వివిధ ఆటగాళ్లు పోటీ పడటం చూస్తున్నాం కానీ, ఈ సీజన్ లో ఆ పోటీ అభిమానుల ఊహలన్నింటిని దాటేసింది.
ఏకంగా 5 బ్యాటర్లు ఈ క్యాప్ రేస్ లో గత నెల రోజులుగా పోటీ పడుతున్నారు. మొదటి నుండి నిలకడగా ఆడుతున్న సీనియర్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’ మరియు తాజా యువ సంచలం ‘సాయి సుదర్శన్’ ఈ క్యాప్ రేస్ లో మొదటి నుండి ఉన్నారు. అయితే, గత 2 -3 వారల వ్యవధిలోనే ఆడిన ప్రతి మ్యాచ్ లో ను అద్భుతమైన ఆటను కనబరిచి ‘సూర్య, గిల్, బట్లర్ మరియు జైస్వాల్’ ఈ క్యాప్ రేస్ లో పాలుపంచుకున్నారు.
ప్రస్తుతం 505 పరుగులతో ఈ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గర ఉండగా, రెండవ స్థానం లో ఉన్న సుదర్శన్ కేవలం ఒక్క పరుగు వెనుకంజ లో ఉంటూ, 504 పరుగుల వద్ద ఉన్నాడు. ఇవాళ గుజరాత్ మరియు ముంబై జట్లు తలపడనున్నాయి. సుదర్శన్, బట్లర్, గిల్ వంటి గుజరాత్ బ్యాటర్లు భీకర ఫామ్ లో ఉన్నారు. అటు, సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్నాడని తెలిసిందే.
కేవలం 40 పరుగుల వ్యత్యాసం లో ఏకంగా 6 బ్యాటర్లు ఈ క్యాప్ రేస్ లో ముందంజలో ఉన్నారు. 505 దగ్గరున్న కోహ్లీ, 465 దగ్గరున్న గిల్ మధ్యలో ఏకంగా 4 బ్యాటర్లు ఉండటం విశేషం. మరి ఇవాళ ఈ టాప్ బ్యాటర్స్ మధ్య పోరు ఉండనున్న వేళ, ఈ ఆరెంజ్ క్యాప్ మరొకసారి చేయి మారనుంది. మరి ఈ ఐపీఎల్ చివరికి, ఏ బ్యాటర్ ఈ ఆరెంజ్ క్యాప్ ను అందుకోగలడని అనుకుంటున్నారు..?
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…