
ఒక ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఫ్రాంచైజ్ అతి ముఖ్యంగా ఆశించేది వారి కెప్టెన్ల ఫామ్ గురించే. తమ సారధులు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే జట్టు సమిష్టిగా రాణించగలదు అని ఫ్రాంచైజీలు గట్టిగా నమ్ముతుంటారు. కానీ, ఈ సీజన్లో ఆ నమ్మకాన్ని కొందరు కెప్టెన్ లు పోగొట్టుకున్నారనే తెలుస్తుంది.
మొదటిగా మాజీ భారత బ్యాటర్ ‘అజింక్య రహానే’. ఈ సీనియర్ ఇండియన్ కోల్కతా జట్టుకు సారధిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే 2 సీజన్లు అవుతుంది. 2024 లో ఈ ఫ్రాంచైజ్ ట్రోఫీ ను గెలిచిన తరువాత అనూహ్యంగా విన్నింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును వీడి ఆక్షన్ కు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక, 2025 సీజన్ కోసం రహానే, డి-కాక్, నరైన్ వంటి సీనియర్ ఆటగాళ్లు కలిగిన ఈ ఫ్రాంచైజ్, సారధి బాధ్యతలను రహానే కు అందించారు. 2025 సీజన్లో జట్టు సమిష్టిగా రాణించలేకపోయినా, రహానే నుండి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఈ సీజన్లో జట్టు కు రహానే తన కాంట్రిబ్యూషన్ ఇవ్వటంలో విఫలమయ్యాడు. దీనితో వచ్చే సీజన్ కు రహానే నుండి కెప్టెన్సీ పగ్గాలను కోల్కత్త జట్టు యాజమాన్యం వెనక్కి తీసుకోనున్నారని ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి.
రెండవ పేరు ప్రస్తుత భారత ఆల్-రౌండర్ ‘అక్షర్ పటేల్’. సీజన్ ప్రారంభానికి ముందు రాహుల్, నిస్సంక, మిల్లర్, స్టార్క్, లుంగీ, కుల్దీప్.. ఇలా ఇంతమంది స్టార్ ప్లేయర్స్ ను లీడ్ చేయబోతున్న అక్షర్ పటేల్ ఈ సీజన్లో కచ్చితంగా ఢిల్లీ కు ఉన్న ప్లే-ఆఫ్ కరువును తీర్చబోతున్నాడని ఆ జట్టు అభిమానులు గట్టిగా ఆశించారు.
సీజన్ మొదటి దశలో ఇది జరిగేటట్లే కనిపించినా, 3వ మ్యాచ్ నుండే ఢిల్లీ తమ స్థాయికి తగిన ప్రదర్శన చూపటంలో విఫలమవుతూనే వస్తుంది. సొంత గ్రౌండ్లో అత్యంత పేలవమైన ఆటతో ఇప్పటికే ప్లే-ఆఫ్ రేస్ నుండి నిరాధికారంగా తొలగించబడ్డారు.
264 పరుగులు చేసి, అంత భారీ టార్గెట్ ను సైతం డిఫెండ్ చేసుకోలేక ఢిల్లీ చతికినబడిన మ్యాచ్ నుండి, ఢిల్లీ జట్టు తిరిగి గాడిన పడలేదు. ఇప్పటికే 12 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ జట్టు కేవలం 5 మ్యాచ్లలో నెగ్గి, 7 మ్యాచ్లలో పరాజితులయ్యారు. చివరిగా ఆడిన పంజాబ్ మ్యాచ్లో ఢిల్లీ గెలిచినప్పటికీ, వారు దాదాపు ఈ సీజన్లో నిష్క్రమించబడ్డారు.
ఇక చివరిగా ఐపీఎల్ హిస్టరీ లో నే అత్యంత ఖరీదైన ప్లేయర్, ప్రస్తుత భారత టెస్ట్ టీమ్ వికెట్ కీపర్ మరియు వైస్ కెప్టెన్ ‘రిషబ్ పంత్’. ఆక్షన్ లో 27 కోట్లు పలికిన పంత్, గత రెండు సీజన్ల ప్రస్తావనకు వస్తే చేతి పై లెక్కపెట్ట గలిగే సంఖ్య గల మ్యాచ్లలో మాత్రమే రిషబ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.
గతేడాది లీగ్ స్టేజి చివరి మ్యాచ్లో బెంగళూరు పై సెంచరీ, ఈ సీజన్లో హైదరాబాద్ పై కొట్టిన హాఫ్-సెంచరీ తో పాటు బెంగళూరు పై 10 బంతుల్లో 32 పరుగులు చేసిన ఇన్నింగ్స్ మాత్రమే ఇతగాడి గత రెండేళ్ల మెరుగైన ఇన్నింగ్స్. ముందుగా ప్రస్తావించిన ఇద్దరు కెప్టెన్స్ మెరుగైన ప్రదర్సన ఇవ్వలేకపోయినా, వారు ఎటు సీనియర్స్ కాబట్టి జట్టు వారిని కాదని వేరే ఆటగాడికి కెప్టెన్నీ అందించగలరు.
కానీ, రిషబ్ పంత్ విషయంలో మాత్రం ఏజ్-ఫాక్టర్ సమస్య కాదు కాబట్టి ఫ్రాంచైజ్ యాజమాన్యం పంత్ పై నమ్మకం ఉంచుతారో లేదో అనేది ప్రస్నార్ధకంగా మారుతుంది. అతని ఫెయిల్యూర్ కు అతడి ప్రైస్-ట్యాగ్ ఏ కారణమంటూ ఎందరో అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి, ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లలో అయినా ఈ ముగ్గురు కెప్టెన్సీ రాణించి తమ జట్లకు విజయాలను అందించగలరా..?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…