
ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధం ఇరాన్ – అమెరికా గా మారడంతో ఆ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచం పై పడింది. హార్మోజ్ జలసంధి మూసివేత తో అటు ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనితో రోజు రోజుకి డాలర్ తో రూపాయి విలువ పతనం అవుతూ వస్తుంది.
బారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్లకు చేరడం, డాలర్ తో రూపాయి విలువ 96.20 గా నమోదుకావడం భారతీయ స్టాక్ మార్కెట్లను కుప్పకూలుస్తున్నాయి. గత వారం సెషన్లో కాస్త లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూత్రాలతో తిరిగి నష్టాల బాటపట్టాయి.
దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో అనిచ్చితి, క్రూడాయిల్ ధరలు వేగంగా పెరగడం భారతీయ స్టాక్ మార్కెట్లను నష్టాలనుండి కోలుకోనివ్వడం లేదు. ఇక రష్యా చమురు దిగుమతుల పై అమెరికా ఇచ్చిన వెసులుబాటు నేటితో ముగియనుండటంతో భారత్ మరింత స్థాయిలో ఇంధన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సూచనలు చేయడంతో ఇక రానున్న రోజులలో ఈ ధరల పెరుగుదల అనివార్యం అనేది చెప్పకనే చెప్పినట్లైయింది. ఒక్క ఇంధన ధర పెంపు దేశ వ్యాప్తంగా అనేక వస్తువుల ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.
కూరగాయల నుంచి పాలు, బియ్యం, నిత్యావసర వస్తులైన ఉప్పు, పప్పు, చింతపండు, వంట నూనె ఇలా ప్రతి వస్తువు పై ఈ ఇంధన ధరల పెంపు ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మోదీ చెప్పినట్టు రానున్న రోజులలో ఇరాన్ – అమెరికా యుద్ధం ఒక కొలిక్కి రాకుంటే దేశంలో పేదరికం శివ తాండవం చేస్తుంది అనేది నిజమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
నానాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు కరిగిపోవడం, దేశంలో ద్రవ్యోల్భణం పెరిగిపోవడం భవిష్యత్ ని మరింత ఆందోళనలోకి నెడుతుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో వేగంగా అడుగులేస్తున్న భారత్ వంటి దేశాలకు ఈ ఇరాన్ యుద్ధం పరిస్థితిని తిరిగి మొదటికి తెచ్చేలా కనిపిస్తుంది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న అనిచ్చితి, రూపాయి విలువ పతనం, క్రూడాయిల్ ధరలు పెరగడం తో భారత దేశీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఫారెన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం లేదు. దీనితో మార్కెట్లు సెల్లింగ్ ప్రెజర్ తో కుప్పకూలుతున్నాయి.
మార్కెట్లు ఓపెన్ అయ్యేసరికి దాదాపు 800 పాయింట్ల నష్టం తో సెన్సెక్స్, నిఫ్టీ 265 పాయింట్ల నష్టంతో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అవి కాస్త కోలుకుని సెన్సెక్స్ 320 పాయింట్ల నష్టంతో 74950 వద్ద నిఫ్టీ 115 పాయింట్ల నష్టంతో 23526 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మరి రూపాయి విలువ బలపడడానికి, చమురు సమస్య పరిష్కారానికి, అమెరిక ఆంక్షల నుంచి రష్యా వద్ద చమురు కొనుగోలుకి మోదీ ప్రభుత్వం రానున్న రోజులలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోనుంది.? భారదేశం ఈ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా మోదీ ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనేది ఆసక్తిగా మారింది.
అలాగే దేశంలో మరోసారి మోదీ సర్కార్ కొలువుతీరాలి అంటే దేశాన్ని ఈ సంక్షోభం నుండి ఎన్డీయే ప్రభుత్వం సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది అనేది ఎన్డీయే నేతలు గ్రహించాలి.
దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలు ఒక పార్టీని చూసి మరో పార్టీ ప్రభావితం అవుతున్నాయా అనే విధంగా ముందుకెళ్తున్నాయి. తాజగా…
Fresh speculation surrounding Netflix’s The Royals has once again brought attention to the growing mix…