
ఎక్కడో వర్షం పడితే పిడుగు మన ఇంటి మీద పడినట్టు ఎక్కడో ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం మొదలవ్వడం, దానిలోకి అమెరికా రంగ ప్రవేశం చెయ్యడం ఆ భారం భారతదేశం తో పాటుగా ప్రపంచ దేశాలు మోస్తున్నాయి.
అవును ఇరాన్ – అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం, చర్చలు, సంప్రదింపులు, సీజ్ ఫెయిర్ తో తాత్కాలిక బ్రేక్ తీసుకునప్పటికీ ఆ యుద్ధ ప్రభావం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తుంది.
హార్మోజ్ మూసివేత, ఇంధన కొరత తో క్రూడాయిల్ ధరలు భారీ స్థాయికి చేరుకుంటున్నాయి. దీనితో రూపాయి విలువ నానాటికి పతనమవుతుంది. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే దేశంలో గ్యాస్ కొరతను సృష్టించింది, ఇక ఇప్పుడు తాజగా ఇంధన కొరతను తీసుకొచ్చింది.
గ్యాస్ కొరతతో, కమర్షియల్ సిలిండర్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఆ భారం మోయలేక ఇప్పటికే దేశంలో చిన్న చిన్న స్ట్రీట్ వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపారాలను మూసుకుంటున్నారు. ఇక వ్యాపారాలను కొనసాగిస్తున్న వారు పెరిగిన సిలిండర్ ధరలకు తగట్టుగా ధరలను పెంచి వినియోగిస్తున్నారు, లేకుంటే గ్యాస్ స్థానంలో కట్టెలపొయ్యిని వినియోగిస్తున్నారు.
అయితే ఈ గ్యాస్ కష్టాలు ఒక్క వ్యాపారులకే కాదు గృహిణులకు ఎదురవుతున్నాయి. దీనితో గ్యాస్ స్టవ్ నుంచి ఇండక్షన్ వైపు వెళ్లాలంటూ ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు చేసారు, అలాగే అందుకు తగ్గట్టుగా ఇండక్షన్ స్టవ్ ల ఉత్పత్తులు పెంచాలంటూ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చారు.
ఇక గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా అయితే కట్టెలపొయ్యి లేకుంట ఇండక్షన్ అన్న ప్రభుత్వాలు ఇక ఇప్పుడు ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రజలు ఈవీ వాహనాల వైపు చూడాలంటూ సలహాలు ఇస్తున్నారు. ఈవీ వాహనాల వినియోగం వల్ల ఇంధనం ఆదా అవుతుందని, తద్వారా వాటి వినియోగ తగ్గుతుందంటూ ప్రభుత్వాలు ఈవీ వాహనాలు కొనుగోళ్ళకు ప్రోత్సహకాలు అందిస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరల భారం ఇక మోయలేం అంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రెండు సార్లు పెంచింది. అయితే ఎక్కడో, ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భారతదేశం నెత్తిన పడినట్టు దేశ ప్రజల జేబులను ఖాళీచేస్తుంది, అలాగే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుంది.
గ్యాస్ కి బదులు ఇండక్షన్, పెట్రోల్ కి ప్రత్యామ్నాయం ఈవీ లు అంటున్న ప్రభుత్వాలు రేపటి రోజున వీటి వినియోగం కూడా పరిధి దాటితే దేశంలో వచ్చే పవర్ సమస్యలకు మరో ప్రత్యామ్నాయం ను చూపగలదా.? లేదంటే అసలు దేశంలో ఆ సమస్యలే రాకుండా జాగ్రత్త పడగలదా.?
Sonu Thakur just delivered a full-on ethnic fashion moment and the internet cannot keep calm.…
#Mega158, featuring the deadly combination of Megastar Chiranjeevi and director Bobby Kolli, was officially launched…